'రౌడీ' కోసం కోట్లు కూడా లెక్క చేయడం లేదట!

మరిన్ని వార్తలు

రౌడీ బాబు విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'హీరో'. టైటిల్‌ చూశారుగా ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో. ఇంత పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెట్టుకున్నాక, బడ్జెట్‌ కూడా ఎక్కువే పెట్టాలి కదా. అందులోనూ అక్కడున్నది విజయ్‌ దేవరకొండాయె. ఎంత బడ్జెట్‌ పెడితేనేమి వృధాగా పోతుందా.? నో ఛాన్స్‌. అందుకే విజయ్‌ దేవరకొండపై ఈ సారి భారీ బడ్జెట్‌ పెట్టేస్తున్నారట 'హీరో' సినిమా కోసం. ఒక్క స్టంట్‌ సీన్‌ కోసమే 8 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే, ఈ సినిమాకి టోటల్‌ బడ్జెట్‌ ఎంతో అర్ధం చేసుకోవాలి.

 

ఇక ఈ సినిమాలో మన రౌడీ హీరో ప్రొఫెషనల్‌ బైకర్‌ పాత్రలో నటించబోతున్నాడట. ప్రొఫెషనల్‌ బైకర్‌గా ఈ పాత్రలో ఇమిడిపోయేందుకు విజయ్‌ దేవరకొండ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడట. ఈ సినిమాలో బైక్‌ నేపథ్యంలో అద్భుతమైన యాక్షన్‌ సీన్‌ తెరకెక్కించనున్నారట. ఢిల్లీలో ఈ యాక్షన్‌ సన్నివేశానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారట. ఈ సీన్‌ సినిమాకే హైలైట్‌ కానుందనీ సమాచారమ్‌.

 

తెలుగుతో పాటు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన కొత్త భామ మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS