ప్ర‌కాష్ రాజ్ ట్వీట్... విష్ణుకి కౌంట‌ర్ ఎటాక్‌?

By iQlikMovies - August 05, 2021 - 11:32 AM IST

మరిన్ని వార్తలు

మా ఎన్నిక‌లకు ఇంకా మూడు నెల‌ల స‌మ‌యం ఉంది. కాక‌పోతే.. ఈసారి ఎల‌క్ష‌న్లు మాత్రం నువ్వా? నేనా? అన్న‌ట్టు సాగ‌బోతున్నాయి. ఏకంగా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఐదుగురు అభ్య‌ర్థులు పోటీలో ఉన్నా, ప్ర‌ధాన పోటీ మాత్రం ప్ర‌కాష్ రాజ్ - విష్షుల‌మ‌ధ్యే అన్న‌ది సుస్ప‌ష్టం. `మా` ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా, `మా బిల్డింగ్` అన్న‌ది ప్ర‌ధాన ఎజెండాగా మారుతుంటుంది. ఈసారీ అంతే. అందుకే విష్ణు... ఈసారి మా బిల్డింగ్ ని నా సొంత ఖ‌ర్చుతో క‌ట్టేస్తా - అని వాగ్దానం చేశాడు. ప్ర‌కాష్ రాజ్ కూడా `నేను మా కోసం స్థ‌లం సంపాదిస్తా` అని మాటిచ్చారు. ఎన్నిక‌ల వేడి ఇక్క‌డితో ఆగిపోలేదు. విష్ణు - ప్ర‌కాష్ రాజ్‌లు ప‌ర‌స్ప‌రం కౌంట‌ర్లు వేసుకున్నారు. ప్రెస్ మీట్లూ, వీడియోల‌తో వేడి మ‌రింత ర‌గిల్చారు. `అరెస్ట్ కావాల్సిన వాళ్ల‌ని ఆదుకున్నాం.. చ‌రిత్ర మ‌ర్చిపోయి మాట్లాడొద్దు` అంటూ ఆమ‌ధ్య ఎవ‌రినో ఉద్దేశించి న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్య‌లు చేశాడు. అవ‌న్నీ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి.

 

ఇప్పుడు తాజాగా ప్ర‌కాష్ రాజ్ `తెగేదాకా లాగొద్దు` అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఇది మ‌రింత వైర‌ల్ అవుతోంది. ఎవ‌రు తెగేదాకా లాగుతున్నారు? లాగితే ఏం అవుతుంది? అనేదేం చెప్ప‌క‌పోయినా - ప్ర‌కాష్ రాజ్ ఉద్దేశ్యం మాత్రం సుస్ప‌ష్టం. ఈ ట్వీట్ ఎవ‌రిని ఉద్దేశించింది? అనే చ‌ర్చ టాలీవుడ్ అంతా న‌డుస్తోంది. ఇది విష్ణుకి కౌంట‌ర్ ఇవ్వ‌డ‌మే అని, విష్ణుకి చెక్ పెట్ట‌డానికి ఇలా కౌంట‌ర్ వేశాడ‌ని చెప్పుకుంటున్నారు టాలీవుడ్ జ‌నాలు. మ‌రి దీనికి విష్ణు రివ‌ర్స్ కౌంట‌ర్ వేస్తాడా, లేదంటే కామ్ గా ఉంటాడా? వెయిట్ అండ్ సీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS