సీపీఐ నేత నారాయణ మరోసారి బిగ్ బాస్‌పై, నాగార్జునపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ షో.. సమాజాన్ని భ్రస్టు పట్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగ్ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించి, తన ఇమేజ్ నీ, తన గౌరవాన్నీ పోగొట్టుకొంటున్నారని అన్నారు. బిగ్ బాస్ షోపై ముందు నుంచీ నారాయణ.. కౌంటర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి.. మరింత ఎక్కువగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవిని కూడా ఈ వ్యవహారంలోకి లాక్కొచ్చారు. థమ్సప్ యాడ్‌లో చిరు ఒకప్పుడు కనిపించిన సంగతి తెలిసిందే. ఆ ఉదంతాన్ని నారాయణ గుర్తు చేశారు
శీతల పానియాలు విష పదార్థాల అవశేషాలుంటాయని సామాజిక వేత్తలు ఆరోపించిన నేపథ్యంలో.. అలాంటి యాడ్‌లో నటించడానికి చిరు నిరాకరించిన సంగతి తెలిసిందే. ``శీతల పానియాల్లో విషపూరిత పదార్థాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ చిరంజీవికి ఓ లేఖ రాశాం. అది చదివి.. అలాంటి యాడ్లకు చిరు దూరమయ్యారు. చిరంజీవికీ. నాగార్జునకీ అదే తేడా..`` అంటూ నారాయణ మరోసారి బిగ్ బాస్ వ్యవహారాన్ని బయటకు లాక్కొచ్చారు నారాయణ.