రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన మృతికి నివాళిగా షూటింగ్‌లను నిలిపివేయకపోవడంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. ట్విటర్ వేదికగా టాలీవుడ్ పెద్దలపై హాట్ కామెంట్స్ చేశారు.
‘‘ కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్ కి,మహేష్,కల్యాణ్‌కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.
భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు వంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్‌ను ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు. మనసు లేకపోయినా సరే.. కనీసం మన చావుకైనా విలువ ఉండాలంటే.. కృష్ణంరాజు లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చవుతోందని నెల రోజులు షూటింగ్‌లు ఆపేసిన పరిశ్రమ మనది’’ అంటూ వరుస ట్వీట్లలో వర్మ మండిపడ్డారు వర్మ.