సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా మంది ఈ వీడియోని తిలకించారు. చూసిన వాళ్లు కొంతమంది చాలా బావుందని కామెంట్ చేస్తున్నారు. వల్గారిటీ లేదంటున్నారు. బోల్డ్ కాన్సెప్ట్ అయినా కానీ థీమ్ చాలా బాగుందని వర్మని ప్రశంసిస్తున్నారు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అంతగా ఈ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉందట. అయితే మరో వర్గం వారు మాత్రం ఈ వీడియోని చూసి తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నారు. అయితే ఎవరి వెర్షన్ వారిది. ఎక్కడో అమెరికాలో విడుదల చేసిన ఈ వీడియోని ఇండియాలో చూడాలంటే 150 రూపాయలు ఖర్చుపెట్టాలన్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు 20 నిముషాల నిడివితో ఉన్న ఈ వీడియోని చూసేందుకు 150 రూపాయలు ఖర్చుపెట్టేందుకు ప్రేక్షకులు వెనకాడకపోవడం విశేషంగానే భావించాలి. అదే వర్మ సినిమాలకున్న క్రేజ్.
అందులోనూ ఈ వీడియో విషయంలో వర్మ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతానా? అసలే ఈ వీడియోలో నటించింది ఓ పోర్న్ స్టార్. ఆమె న్యూడ్ ఫోటోలతో వర్మ సోషల్ మీడియాలో చేసిన పబ్లిసిటీ స్టంట్ అంతా ఇంతా కాదు. అందరికీ తెలిసిన సంగతే. మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టినా, ఈ వీడియో విడుదలకు ఎన్ని అభ్యంతరాలు వెల్లువెత్తినా, చివరికి వర్మ 'జీఎస్‌టీ'నీ విడుదల చేసి తీరాడంతే. అయితే ఈ వీడియో చుట్టూ రేగిన వివాదాలే ఈ వీడియోపై ఇంత హైప్ క్రియేట్ అయ్యేందుకు కారణాలయ్యాయనడంలో సందేహం లేదని చెప్పాలి.