తాప్సీకి ఆ హీరో పేరు చెప్పే ధైర్యం లేదా?

మరిన్ని వార్తలు

తెలుగు సినిమాలతో హీరోయిన్‌గా పరిచయమై, టాలీవుడ్‌లో గ్లామరస్‌ తారగా పేరు తెచ్చుకున్న బ్యూటీ తాప్సీ. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌ని మించి బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకుంటోంది. అందులోనూ అక్కడ ప్రాధాన్యత ఉన్న రోల్స్‌తో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌లో దూసుకెళ్లిపోతోంది. 

అగ్ర హీరోలతో నటిస్తూ, హీరో పాత్రలకు ధీటుగా ఇంపార్టెన్స్‌ ఉన్న హీరోయిన్‌ రోల్స్‌ని ఎంచుకుంటోంది. దాంతో టాలీవుడ్‌పై చిన్న చూపు ప్రదర్శిస్తోంది తాప్సీ అంటూ ఆమెపై విమర్శలు కూడా వున్న సంగతి తెలిసిందే. అంతేకాదు డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ అంటూ చెప్పుకునే ఈ ముద్దుగుమ్మ ఈజీగా, తెలివిగా అందరిపైనా సెటైర్లు కూడా వేసేస్తూ ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో అందులోనూ, ది గ్రేట్‌ డైరెక్టర్‌ రాఘవేంద్రరావు మీదే హాట్‌ హాట్‌గా సెటైర్లు వేసేసిందీ బ్యూటీ. అయితే తన తప్పు తెలుసుకుని తర్వాత సోరీ కూడా చెప్పిందిలెండి. 

అయితే ఇది గడిచిపోయిన గతం. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ హీరోపై ఇలాంటి సెటైర్లే వేస్తోందిప్పుడు. ఓ సినిమాలో హీరో పాత్ర సన్నివేశం కోసం తన పాత్ర సన్నివేశాన్ని మార్చేశారట. తనతో చెప్పకుండా ఆ సన్నివేశాన్ని మార్చేశారనీ, ఆ విషయం తనని చాలా బాధించిందనీ అంటోంది తాప్సీ. అయితే ఇంతకీ ఆ హీరో ఎవరు..? పేరు చెప్పే ధైర్యం మన డేరింగ్‌ అండ్‌ డేషింగ్‌ లేడీ తాప్సీకి లేదా? అని నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. 

ఏదేమైనా, తనకి గౌరవం ఇచ్చి, తన పాత్రకు హీరోతో సమాన ప్రాధాన్యత ఇచ్చే వారితోనే కలిసి నటించాలని నిర్ణయించుకుందట ముద్దుగుమ్మ తాప్సి. అయితే సినీ రంగంలో మరీ ఇంత డేరింగ్‌ వర్కవుటవుతుందా? స్టార్‌డమ్‌ ఉన్నన్నాళ్లూ మాత్రమే ఈ ఆటిట్యూడ్‌ వర్కవుట్‌ అవుతుంది. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? ఏమో తాప్సీకే తెలియాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS