అందుకే అలాంటి పాత్రలే చేస్తున్నా - సీరత్‌

మరిన్ని వార్తలు

ఆకట్టుకునే అందం. అంతకుమించిన చలాకీ తనం ఆ ముద్దుగుమ్మ సొంతం. ఎవరా ముద్దుగుమ్మ ఏంటా కథ అంటే, 'రన్‌ రాజా రన్‌' చిత్రంతో బుజీమా బుజీమా.. అంటూ కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసిన ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌. తాజాగా ఈ బ్యూటీ 'టచ్‌ చేసి చూడు' చిత్రంలో నటిస్తోంది. మొన్నీ మధ్యనే 'రాజుగారి గది 2'లో నాగార్జున సరసన నటించింది. 

వరుసగా స్టార్‌ హీరోల తో ఛాన్సెస్‌ దక్కించుకుంటున్నా, అమ్మడికి సెకండ్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌లైన్‌ మాత్రం స్ధిరపడిపోయేటట్లుంది. అదే విషయం ఈ బ్యూటీని అడిగితే, సింపుల్‌గా సమాధానం చెప్పేసింది. సెకండ్‌ హీరోయిన్‌ అయితేనేం, తన పాత్రకు, సినిమాలో ఇంపార్టెన్స్‌ ఎక్కువ ఉంటోంది. అందుకే ఒప్పుకుంటున్నానని అంటోంది. కామన్‌గా సెకండ్‌ హీరోయిన్‌ రోల్స్‌లో నటించే అందాల భామలు చెప్పే రొటీన్‌ స్టోరీనే అయినప్పటికీ, సీరత్‌ చెబుతుంటే, ఇంకా ముద్దు ముద్దుగా అనిపిస్తోంది. 

ఇకపోతే 'టచ్‌ చేసి చూడు ' సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో రవితేజతో సీరత్‌కి ఓ మాస్‌ సాంగ్‌ ఉందట. ఆ సాంగ్‌లో సీరత్‌ వేసిన స్టెప్పులకి మాస్‌ నుండి వచ్చే రెస్పాన్స్‌ అదిరిపోనుందని చిత్ర యూనిట్‌ అంటోంది. సీరత్‌ మంచి డాన్సర్‌ అన్న సంగతి తెలిసిందే. అయితే రవితేజలాంటి జోష్‌ హీరో పక్కన మాస్‌ స్టెప్పులంటే, ఇంకే రేంజ్‌లో అమ్మడు రెచ్చిపోయి ఉంటుందో ఊహించుకోవచ్చు. గ్లామర్‌లో అస్సలు హద్దులు లేవు ఈ బ్యూటీకి. 

అభినయంలోనూ మంచి మార్కులే వేయించుకుంటోంది. అయితే సరైన ఛాన్స్‌ వస్తే, తన సత్తా ఏంటో చూపిస్తానంటోంది అందాల సీరత్‌. ప్రస్తుతం సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఓ సినిమా సీరత్‌ చేతిలో ఉందట. ఇవి కాక మరి కొన్ని క్రేజీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయంటోంది ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS