ఎన్టీఆర్‌ క్రేజ్‌ మామూలుగా లేదండోయ్‌ బాబూ.!

మరిన్ని వార్తలు

క్రిష్‌ దర్శకత్వంలో బాలయ్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్‌'. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత గాధగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రారంభానికి ముందే ఈ సినిమాపై అంచనాలున్నాయి. నందమూరి తారకరామారావు జీవిత గాధపై ఉన్న ఆశక్తే అందుకు కారణం. 

ఇకపోతే భారీ కాస్టింగ్‌ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచుకుంటూ పోతోంది. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ విషయంలో ఊహాగానాలు వెలువడుతున్నాయి. బాలయ్య కెరీర్‌లోనే ఈ రేంజ్‌లో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిన సినిమా లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్‌లో కూడా 'ఎన్టీఆర్‌'కి కనీ వినీ ఎరుగని రీతిలో బిజినెస్‌ జరుగుతోందట. సంక్రాంతి బాలయ్యకు బాగా కలిసొచ్చిన పండగ. అందుకే ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్‌ చిత్రాన్ని సంక్రాంతి బరిలో ఉంచారు. 

అంతేకాదు, క్రిష్‌ - బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా సంక్రాంతికి విడుదలై దేశం మీసం తిప్పింది. అలాగే ఇదే కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్‌ కూడా ఆ స్థాయి విజయం సాధించాలనే క్రిష్‌ తెగ కష్టపడుతున్నాడట. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్స్‌ డిజైనింగ్‌ చూస్తేనే ఈ బయోపిక్‌కి నేచురాలిటీ తెచ్చేందుకు క్రిష్‌ ఎంత కష్టపడుతున్నాడో అర్ధమవుతోంది. 

నారా చంద్రబాబుగా రానాని తీర్చి దిద్దిన వైనం, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌ మేకోవర్‌ ఇలా ప్రతీ ఒక్క క్యారెక్టర్‌కీ జీవం పోసేస్తున్నాడు క్రిష్‌. త్వరలోనే బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసే యోచనలో క్రిష్‌ అండ్‌ టీమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS