అదేంటీ.! ఈ పేరు వినబడక చాలా కాలమే అయ్యింది కదా. అఫీషియల్‌గా నగర బహిష్కరణకు గురైన కత్తి మహేష్ గొంతు మళ్లీ వినిపిస్తోంది.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును తాజాగా బిగ్‌బాస్ షోలో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన కౌషల్‌పై విమర్శలు గుప్పిస్తూ పోస్ట్‌లు పెడుతున్నాడు కత్తి మహేష్.
కౌషల్‌ని బిగ్‌బాస్ షో నుండి బయటికి గెంటేయ్యాలని బిగ్‌బాస్ టైటిల్‌కి కౌషల్ అనర్హుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. కౌషల్‌పై విమర్శలు చేస్తే కౌషల్ ఆర్మీ ఊరుకుంటుందా? మామూలుగా కౌషల్‌ని ఏమైనా అంటేనే ఊరుకోదు ఆ ఆర్మీ. ఆ షో హోస్ట్ అయిన నానినే విడిచి పెట్టడం లేదు. అలాంటిది ఈ రకమైన విమర్శలు. అందులోనూ కత్తి మహేష్ అకౌంట్ నుండి.. ఎందుకు ఊరుకుంటారు మరి. అందుకే సోషల్ మీడియాలో కత్తి మహేష్‌పై ట్రాలింగ్ మొదలైంది.
ఎడా పెడా కత్తి మహేష్ పోస్ట్‌లకు కౌషల్ ఆర్మీతో పాటు, కౌషల్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. అయితే కత్తి మహేష్‌కి సోషల్ మీడియాలో చాలా అకౌంట్లున్నాయి. ఈ పోస్ట్‌లు పెడతున్నది నిజంగా కత్తి మహేషేనా? లేక ఆయన అకౌంట్ యూజ్ చేసుకుని వేరెవరైనా ఇలాంటి దశ్చర్యకు పాల్పడుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.