పాపం నాని మళ్లీ బుక్కయ్యాడు.!

By iQlikMovies - September 03, 2018 - 17:27 PM IST

మరిన్ని వార్తలు

ఆదివారం బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌కి హోస్ట్‌ నాని పెద్ద షాకే ఇచ్చాడు. సినిమాల్లో విలన్‌ పాత్రలు వేసే అమిత్‌ ఎలిమినేట్‌ అవుతాడని బిగ్‌బాస్‌ ప్రేక్షకులు భావిస్తే, నూతన్‌నాయుడు ఎలిమినేట్‌ అయినట్లు నాని ప్రకటించాడు. అంతే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌. సోషల్‌ మీడియాలో నానిని, బిగ్‌బాస్‌ నిర్వాహకుల్ని విమర్శిస్తూ పోస్ట్‌లు పోటెత్తాయి. 

పలు రకాల సర్వేలో కౌషల్‌ తర్వాత అంతటి ఫాలోయింగ్‌ ఈ సారి నూతన్‌కే దక్కింది. దానికి కారణం లేకపోలేదు. 40 ఓట్లు కౌషల్‌కి వేసి, మినిమమ్‌ 10 ఓట్లు నూతన్‌కి వేయాలని కౌషల్‌ ఆర్మీ ఫిక్సయ్యింది. అలా కౌషల్‌కి ఓట్లు చాలా వచ్చాయి. ఓట్ల పరంగా అమిత్‌ రెండో అతి తక్కువ ఓట్లు సాధించాడు. అతి తక్కువ ఓట్లు లెక్కలో గణేష్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటే, అతన్ని శనివారమే ఎలిమినేట్‌ చేయడం జరిగింది. ఒక్క రోజులో మొత్తం సీన్‌ మారిపోయింది. 

అయితే ఇక్కడ నాని చేయగలిగిందేమీ లేదు. ఇదంతా బిగ్‌బాస్‌ నిర్వాహకుల వ్యవహారమే. కానీ పైకి కనిపించేది నాని కాబట్టి, అతన్నే ట్రోల్‌ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 1తో ఎన్టీఆర్‌ ఇంటింటికీ అతి చేరువగా వెళితే, నాని దూరంగా జరిగిపోతున్నాడు. నాని కొత్త సినిమా 'దేవదాస్‌'ని బాయ్‌కాట్‌ చేయాలని సోషల్‌ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు జత చేస్తున్నారు. నానికి మరో బ్యాడ్‌ న్యూస్‌ ఏంటంటే, అలా నానిని ట్రోల్‌ చేస్తున్న వారిలో మహిళలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 

తన ప్రమేయం పెద్దగా లేకుండానే పాపం నాని చెడ్డపేరు మూట కట్టుకోవాల్సి వస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS