అనిల్ సుంకర నిర్మాణం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లో మహేష్ బాబుతో చెప్పించిన డైలాగ్ 'భయపడేవాడే బేరాలాడతాడు' ఇన్స్టంట్ గా హిట్ అయి ఉండొచ్చు కానీ.. అదొక అర్ధం పర్ధం లేని డైలాగ్ అనే విమర్శలు ఇప్పుడిప్పుడు మెల్లగా వినిపిస్తున్నాయి. . ఎందుకంటె.. బేరాలాడడం భయానికి సంకేతం కానే కాదు. జాగ్రత్తకు సంకేతం. ఎంత తెగ బలిసినవాళ్లయినా ఎంతో కొంత బేరాలాడతారు. సినిమాలో ఏ సందర్భంలో ఆ డైలాగ్ పెట్టారో ప్రస్తుతానికి మనకు తెలియదు కానీ.. అది చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి అవగాహనా రాహిత్యానికి అద్దం పడుతోందనే కామెంట్స్ వెలువడుతున్నాయి.. అలాగే 'గాయం విలువ తెలిసినోడే సాయం చేస్తాడు' అనే డైలాగ్ లోనూ ప్రాసం కోసం పడిన పాకులాట కనిపిస్తుంది తప్ప డెప్త్ కనిపించడం లేదని అంటున్నారు.
దేవీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం నుంచి టైటిల్ ట్రాక్ తప్ప సాంగ్స్ ఇంకా విడుదల కాలేదు. ఇటీవల మహేష్ బాబుకు దేవిశ్రీ ఆస్థాన సంగీత దర్శకుడు అయిపోయాడు. ఇకపోతే ఈ సినిమా నుంచి మహేష్ బాబుతో మొదటిసారి జత కట్టిన కన్నడ భామ రష్మిక లుక్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంది. పదిహేనేళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రంగానూ ప్రత్యేకత సంతరించుకున్న 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న విడుదల కానుంది. ఆ మరుసటి రోజే అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' రానుంది. మరి ఈ రెండు చిత్రాల్లో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సిందే!!