నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు శ్రీకాంత్ తనయుడు రోషన్. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో.... మళ్లీ రోషన్ తెరపై కనిపిస్తాడా? కనిపిస్తే ఎప్పుడు? అనే ఆసక్తి మొదలైంది. ఇప్పుడు మరోసారి రోషన్‌కి లక్కీఛాన్స్ దొరికింది. ఈసారి రోషన్‌కి హిట్ ఇచ్చే బాధ్యతని కె.రాఘవేంద్రరావు తీసుకున్నారు. రాఘవేంద్రరావు నిర్మాణ, దర్శకత్వ సారథ్యంలో రోషన్ కథానాయకుడిగా ఓసినిమా తెరకెక్కబోతోంది.
గౌరీ దర్శకత్వం వహిస్తారు. దిల్ రాజు కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోబోతున్నారు. కథ రెడీ అయ్యింది. మిగిలిన తారాగణం ఎంపిక జరుగుతోంది. దర్శకేంద్రుడి అండ, దిల్ రాజు సహకారం.. ఇవి రెండూ చాలు కదా?? వాతావరణం చూస్తుంటే రోషన్ ఈసారి హిట్టు కొట్టేట్టే కనిపిస్తున్నాడు. చూద్దాం.. శ్రీకాంత్ తనయుడి జాతకం ఎలా వుందో?