ఈమధ్య తెలుగులో లేడీ విలన్ల హవా ఎక్కువైంది. సందీప్ కిషన్ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్ అవతారం ఎత్తింది. క్రాక్‌లోనూ తను అలానే కనిపించింది. తాజాగా.. బాలకృష్ణ సినిమలోనూ తను నెగిటీవ్ ఛాయలున్న పాత్ర పోషించడానికి ఒప్పుకుంది. `మాస్ట్రో`లో తమన్నా లేడీ విలనే. ఇప్పుడు మరో లేడీ విలన్ వచ్చింది. రవితేజ సినిమా కోసం.
రవితేజ - సుధీర్ వర్మ కలయికలో రావణాసుర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ గా... దక్షా నగార్కర్‌ని ఎంచుకున్నట్టు సమాచారం. `జాంబీరెడ్డి`లో కథానాయికగా పరిచయం అయ్యింది దక్షా. ఆ తరవాత పెద్ద గా అవకాశాలు రాలేదు. ఎట్టకేలకు రవితేజ సినిమాలో ఆఫర్ దక్కింది. ఇందులో తనకు నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర పడిందట. ఈ పాత్ర కోసం అనసూయ లాంటి వాళ్ల పేర్లు పరిశీలించారని, చివరికి కొత్తమ్మాయి ఉంటే, ఫ్రెష్ లుక్ ఉంటుందని భావించి, దక్షాని ఎంపిక చేసుకున్నారని సమాచారం. రవితేజ లాయర్ గా నటించబోయే ఈ చిత్రానికి అభిషేక్ నామా నిర్మాత. ఈనెల 14 నుంచి లాంఛనంగా షూటింగ్ ప్రారంభిస్తారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.