నందమూరి నటసింహం బాలకృష్ణ రీసెంట్ గా 'డాకు మహారాజ్' సినిమాతో ప్రేక్షకుల్ని అలరించాడు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలతో పోటీపడి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది 'డాకు మహారాజ్'. కలక్షన్ల పరంగా కూడా సినిమా బాగానే వసూల్ చేసింది అన్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ మొదట తెలుగులో రిలీజ్ అయ్యింది. ఇక్కడ పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నాక తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేసారు. అయితే డాకు మహారాజ్ పై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అదేంటి అంటే అవసరానికి మించి నిర్మాతలు ఖర్చు పెట్టారని.
ఈ కథకోసం అంత ఖర్చు పెట్టాల్సిన పనిలేదని, మేకర్స్ ఈ చిత్రం కోసం వెనుకా ముందు ఆలోచించ కుండా డైరక్టర్ ని నమ్మి ఖర్చు పెట్టారని, ఎక్కువ రీషూట్ల కోసం మనీ వేస్ట్ చేసినట్లు అభిప్రాయ పడుతున్నారు. ఈ రోజుల్లో చిన్న నిర్మాతలు దగ్గరనుంచి పెద్ద నిర్మాతలవరకు ఒక్కటే ఆలోచనతో ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు, పాన్ ఇండియా సినిమా కాబట్టి కలక్షన్లు వస్తాయి, ఓటీటీ రైట్స్ ,శాటిలైట్ రైట్స్, ఓవర్సిస్ అని లెక్కలు వేసుకుని ధీమాగా ఉన్నారని సినీ క్రిటిక్స్ వాదన.
డాకు మహారాజు సినిమా బయ్యర్స్ కొన్ని చోట్ల లాభాలు పొందితే, మరికొన్ని చోట్ల నష్టాలు చూసారు. బయట పాజిటీవ్ టాక్ ఉన్నా కలక్షన్లు అంత గొప్పగా లేవని పలువురి అభిప్రాయం. దీంతో ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వేస్ట్ అయిందని వీరి వాదన. ఈ మధ్య మన తెలుగు సినిమాలు బడ్జెట్ ని మించి వసూల్ చేస్తున్నాయి. నార్మల్ సినిమాలు బ్రేక్ ఈవెన్ కి చేరుకుంటున్నాయి. ఇలాంటి క్రమంలో స్టార్ హీరో, స్టార్ కాస్టింగ్ అన్నీ ఉన్నా కలక్షన్లు మరీ అంతగా రాలేదు.