బ్రేకప్‌ చెప్పేస్తున్న 'దంగల్‌' బ్యూటీ?

మరిన్ని వార్తలు

కంగారు పడకండి. ఇదేం లవ్‌ బ్రేకప్‌ కాదులెండి. అసలు వివరాల్లోకి వెళదాం. 'దంగల్‌' సినిమాలో అమీర్‌ ఖాన్‌ కూతుళ్లు తెలుసు కదా.. ఒకరు ఫాతిమా సనా షేక్‌, మరొకరు జైరా వాసిమ్‌. ఈ ఇద్దరూ చేసిన సినిమాల కన్నా, విమర్శల పాలైందే ఎక్కువ. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించేశారు. ముశ్లిం సాంప్రదాయాలకు భంగం కలిగేలా వీరు ప్రవర్తిస్తున్నారంటూ ఈ ముద్దుగుమ్మల్ని దుమ్మెత్తి పోసేశారు.

 

కేసులు, కోర్టుల వరకూ వెళ్లాయి ఈ తగాదాలు. ఎట్టకేలకు సర్దుకున్నాయనుకుంటే, ముద్దుగుమ్మ జైరా వాసిమ్‌ తాజాగా ఓ బాంబ్‌ పేల్చింది. తాను సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తున్నానని ప్రకటించింది. అదేంటీ.? బోలెడంత కెరీర్‌ ఉన్న ఈ భామ అప్పుడే సినిమాలకు బ్రేకప్‌ అనడమేంటీ.? అని ఆశ్చర్యమేస్తోంది. అయితే, సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. అందరికీ తెలిసిందే. ఆ రంగులు పై పైన చూసేందుకే చాలా బాగుంటాయ. ఆ ప్రపంచంలోకి అడుగు పెడితేనే కదా ఆసలు రంగు మహత్యమేంటో తెలిసేది.

 

అందుకే ఈ రంగుల ప్రపంచానికి తాను తగిన మనిషినే అయినా, అది తనకు తగదనే నిర్ణయం తీసుకుందట. సో సినిమాలకు దూరమవుతున్నానని చెప్పేసింది. క్యూట్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మకు గట్టిగా ప్రయత్నిస్తే, బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లోనూ మెండుగా ఆఫర్లు వచ్చే ఛాన్స్‌ లేకపోలేదు. కానీ, ఈ భామ తీసుకున్న సంచలన నిర్ణయం జైరాని అందుకు దూరం చేసేసిందనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS