ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'విక్కీ డోనర్' సినిమా అప్పట్లో ఓ సంచలనం, తెలిసిన సంగతే కదా. తెలుగులో ఈ సినిమాని 'నరుడా డోనరుడా' టైటిల్‌తో సుమంత్ హీరోగా రీమేక్ చేశారు. కానీ, తెలుగులో ఈ కంటెంట్ ఎందుకో జనాలకి ఎక్కలేదు. ఈ సంగతి సరే, అసలెందుకు ఈ టాపిక్ ఇప్పుడు ఎత్తాల్సి వచ్చిందా.. అంటే, హిందీ మూవీ 'విక్కీడోనర్'లో యామీ గౌతమ్ హీరోయిన్‌గా నటించింది.
అయితే ఆ ప్లేస్‌లో కాంట్రవర్సీ భామ రాధికా ఆప్టే నటించాల్సి ఉందట. అయితే, సినిమా ఒప్పుకున్నాక వన్ మంత్ గ్యాప్ దొరకడంతో హాలీడే ట్రిప్‌కని వెళ్లి ఫుల్ల్‌గా బీరు తాగి లావైపోయిందట. దాంతో లావెక్కిన రాధికా ఆప్టేని చూసి, సినిమా యూనిట్ ఆ సినిమా నుండి తప్పించారట. ఇంకో నెల టైమిస్తే సన్నబడతానని చెప్పినా వినలేదట. అలా ఆ ప్లేస్‌లోకి యామీ గౌతమ్‌ని తీసుకొచ్చి సినిమా కంప్లీట్ చేశారట. భలేగుంది కదా ఈ భామ బీరు కథ. తాజాగా రాధికా ఆప్టే ఓ షోలో ఈ కథంతా విప్పి చెప్పింది. కథ బాగానే ఉంది కానీ, ఎప్పుడూ బక్క పలచని అందాలతోనే కనిపించే రాధికా ఆప్టే బొద్దుగా ఉంటే, కాదు, కాదు, ఛాన్స్ పోగొట్టుకునేంత లావుగా ఉంటే ఎలా ఉంటుందబ్బా.. అని ఆలోచనలో పడ్డారా? ఊహించడం కాస్త కష్టమే కానీ, ఈ భామే స్వయంగా చెప్పింది కాబట్టి, ఊహించుకోండి.
ఎవరికి నచ్చినట్లు వారు. ఇకపోతే ఈ అమ్మడి గురించి తెలిసిందే కదా.. క్యారెక్టర్ డిమాండ్ చేసిందా.. న్యూడ్‌షో చేయడానికైనా సిద్ధమే. అప్పట్లో 'పర్చేద్' మూవీ కోసం అలాగే న్యూడ్ షో చేసి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. పలు విమర్శలు ఎదుర్కొంది. అఫ్‌కోర్స్ ఆ తర్వాతే బాగా పాపులర్ అయ్యిందనుకోండి. అదీ ఈ భామ బీరు కథ. ఎవరైనా లావెక్కాలనుకుంటే, అమ్మడు చెప్పినట్లు బీరు తాగితే చాలన్న మాట.