మీ న‌మ్మ‌కాన్ని వమ్ము చేయ‌ను - సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్‌.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.

 

శ‌నివారం అనిరుద్ సంగీత సారథ్యం వ‌హించిన ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో .... సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ ``సుభాస్క‌ర‌న్ నాకు మంచి స్నేహితుడు. త‌నొక సినిమా ప్రొడ్యైస‌ర్‌గానే మ‌న‌కు తెలుసు. కానీ తను లండన్ లో పెద్ద బిజినెస్ మేన్. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. స‌మాజానికి సేవ చేస్తున్నాడు. త‌న నిర్మాణంలో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నేను 2.0 సినిమా చేసే సమయంలో మా బ్యానర్ లో మరో సినిమా చేయాల‌ని ఆయ‌న‌ నన్ను అడిగాడు నేను సరేనన్నాను. ఈ సినిమాలో నన్ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు? అని ఆలోచించినప్పుడు నాకు మురుగ‌దాస్‌గారు ఆలోచ‌న‌లోకి వ‌చ్చారు. ఆయన డైరెక్ట్ చేసిన రమణ, గజినీ చిత్రాలు నాకు బాగా నచ్చాయి అప్పుడే ఆయనతో సినిమా చేయాలనుకున్నాను ఆయన కూడా సరేనన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా సినిమా చేయడానికి వీలు కాలేదు. `కబాలి`, `కాలా` సినిమాలు చేసే సమయంలో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథతో సినిమా చేస్తానన్నాడు మురుగ‌దాస్‌. అయితే `పేట` చిత్రంలో నన్ను చూసి మీరు ఇలాంటి క్యారెక్టర్స్‌ చేస్తారని తెలిసి ఉంటే నేను అద్భుతమైన సినిమా చేసేవాడిని క‌దా! అని ఒక వారంలోనే `దర్బార్` కథతో నా దగ్గరకు వచ్చాడు. అలా ఈ సినిమా ప్రారంభమైందీ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందింది. చాలా రోజుల తర్వాత శంకర్‌లా ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు మెసేజ్ ఇచ్చే సినిమాలు చేసే ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌తో ప‌నిచేయం ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ ఇలా అన్ని హంగులుంటాయి. అలాగే సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివ‌న్‌తో ద‌ళ‌ప‌తి త‌ర్వాత 29 ఏళ్లకు క‌లిసి ప‌నిచేసిన సినిమా. అలాగే నయనతార ఈ సినిమాలో న‌టించింది. త‌ను చంద్రముఖిలో తొలిసారి నాతో న‌టించింది.

 

ఈ సినిమాలో చంద్ర‌ముఖి కంటే గ్లామర్ గా ఎనర్జిటిక్ గా కనపడుతుంది. అలాగే సునీల్ శెట్టి, యోగిబాబు, నివేదా థామస్ ఇలా అంద‌రూ చాలా మంచి పాత్రలు చేశారు. రామ్ లక్ష్మణ్ అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశారు. అలాగే క్లైమాక్స్ ఫైట్‌ను పీటర్ హెయిన్స్‌గారు కంపోజ్ చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. వర్షాల కారణంగా గా సినిమా షెడ్యూల్ ఆలస్యమైంది. అయితే ఈ సినిమాను మురుగ‌దాస్ 90 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆయ‌న‌ కాకుండా మ‌రెవరున్నా ఈ సినిమాను అంత క్వాలిటీగా, త్వ‌ర‌గా పూర్తి చేయ‌లేరు. అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. `పేట` కంటే ఈ సినిమాలో పాట‌లు బావున్నాయి. సాధార‌ణంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో ఇళ‌య‌రాజాగారికి స‌న్నివేశాల‌ను స్క్రిప్ట్ ప‌రంగా డెవ‌ల‌ప్ చేయ‌డం.. వాటికి సంగీతంతో ప్రాణం పోస్తారు. ఆ త‌ర్వాత అలాంటి సెన్స్ నేను అనిరుద్‌లోనే చూశాను. మంచి వ్యక్తులు అందరూ మంచి మనసుతో మంచి సమయంలో కలిసి చేసిన సినిమా ఇది కాబట్టి మంచి సమయంలోనే రిలీజ్ అవుతుంది.

 

నేను త‌మిళ‌నాడుకి వ‌చ్చేటప్పుడు నాపై న‌మ్మ‌కంతో న‌న్ను ఇక్క‌డ అడుగు పెట్టించిన వారి నుండి. నాపై న‌మ్మ‌కంతో సినిమాలు రూపొందించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు అంద‌రి న‌మ్మ‌కాన్ని నేను వ‌మ్ము చేయ‌లేదు. ఇప్పుడు `ద‌ర్బార్‌`తో మీ న‌మ్మ‌కాన్ని వమ్ము చేయ‌ను. డిసెంబర్ 12న నా పుట్టిన రోజు ఆరోజు నేను పెద్దగా సెలబ్రేట్ చేసుకోననే సంగ‌తి తెలిసిందే. అభిమానులు కూడా ఆ రోజున గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేయ‌వ‌ద్దు. ఆ డ‌బ్బుల‌తో పేదలకు అనాధలకు సాయం చేయాలని కోరుతున్నాను `` అన్నారు.

 

చిత్ర ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ ``నాకు ఊహ తెలిసి మా ఊరిలో థియేటర్ లో నేను చూసిన హీరో రజినీకాంత్‌గారే. ఆయనతో సినిమా తీయడం సంతోషంగా ఉంది. ఆయన మనకు దొరికిన వరం. దేవుడ్ని నమ్మినవాడు కష్టపడతాడు నిజాయితీగా ఉంటాడు అని నమ్మే వారిలో ఆయన ఒకరు. ఆయన చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన జీవితమనే పెద్ద నౌకలో నేను ఏడాదిపాటు ట్రావెల్ చేయ‌డం గ‌ర్వంగా అనిపిస్తుంది. నయనతార, నివేదా థామస్, యోగిబాబు, సునీల్ శెట్టిగారు ఇలా అందరూ పాత్రలు చాలా బాగుంటాయి. `కత్తి` సినిమా స‌మ‌యంలో సుభాస్క‌ర‌న్‌గారితో సినిమా చేశాను. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌పై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ఆయ‌నే త‌మిళ సినిమాకు ఓ పిల్ల‌ర్‌లా త‌న వంతు స‌పోర్ట్ అందిస్తున్నారు. `క‌త్తి` త‌ర్వాత ఆయ‌న నిర్మాణంలో `ద‌ర్బార్‌` చేయ‌డం ఆనందంగా ఉంది. అనిరుద్ చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. ఎడిట‌ర్ శ్రీకర్ ప్రసాద్‌గారు ఓ స‌న్నివేశాన్ని చూసిన‌ప్పుడు కేవ‌లం ఎడిటింగ్ మాత్ర‌మే చేయ‌కుండా సన్నివేశాన్ని ఎన్‌హెన్స్ చేయ‌డానికి ఏం చేయాల‌నే సూచ‌న‌లు ఇస్తారు. అలాగే సంతోశ్‌శివ‌న్‌గారితో ర‌జ‌నీకాంత్ కాంబినేష‌న్ అంటే ద‌ళ‌ప‌తి సినిమానే గుర్తుకు వ‌స్తుంది. 29 ఏళ్ల‌కు ఈ కాంబినేష‌న్‌ను నేను డైరెక్ట్ చేయ‌డం ఆనందంగా ఉంది. అలాగే యాక్ష‌న్ స‌న్నివేశాలు ఓ ఎమోష‌న్‌తో ఉంటాయి. రామ్‌లక్ష్మణ్‌గారు, పీట‌ర్ హెయిన్స్‌గారు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేశారు. గ‌త 15 ఏళ్ల‌లో రజినీకాంత్‌గారిని ప్రేక్షకులు చూడని విధంగా యాక్ష‌న్ సన్నివేశాలుంటాయి`` అన్నారు.

 

డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ``ఈ సినిమాకు మెయిన్ హీరో అనిరుద్‌. త‌ను చాలా టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్. బెస్ట్ ఇచ్చేవరకు మ‌న కంటే ముందు త‌నే కాంప్రమైస్ కాడు. ఇప్పుడు తనతో నేను ఓ సినిమా చేస్తున్నాననే విషయం అంద‌రికీ తెల‌సిందే. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా మ్యూజిక్ ఇవ్వ‌డం త‌న‌కు బాగా తెలుసు. డైరెక్టర్ మురుగదాస్ మంచి రైటర్. నాకిష్టమైన దర్శకుడు కూడా. ఆయ‌న త‌న సినిమాల్లో హీరో విలన్ పాత్రలను అద్భుతంగా డిజైన్ చేసాడు. ఈ రెండు పాత్రలు క్లైమాక్స్‌లో ఎలా పోరాడుతాయో అనే ఆస‌క్తిని ప్ర‌తి స‌న్నివేశాలో పెంచుకుంటూ పోయి. క్లైమాక్స్‌ను అద్భుతంగా డిజైన్ చేస్తాడు. అదే ఆయన బలం. ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా చేసిన సునీల్‌శెట్టిగారికి అభినంద‌న‌లు. అలాగే పెద్ద సినిమాలను నిర్మించాలంటే డబ్బులు ఉంటేనే సరిపోదు ఫ్యాషన్ కూడా ఉండాలి. అలాంటి ఫ్యాషన్ ఉన్న నిర్మాత సుభాస్క‌ర‌న్‌గారు. ఆయ‌న‌తో 2.0కి క‌లిసి ప‌నిచేశాను. ఇప్పుడు లైకా బ్యాన‌ర్‌లో `ఇండియ‌న్ 2` చేస్తున్నాను. ఈ సినిమాల‌తో పాటు ఆయ‌న ర‌జినీసార్‌తో తెర‌కెక్కించిన మ‌రో భారీ చిత్ర‌మే `ద‌ర్బార్‌`.ఈ సినిమాతో ఆయనకు గొప్ప సక్సెస్ రావాలి. ఇలాంటి గొప్ప సినిమాలు మరిన్ని చేయాలి. రజినీకాంత్‌గారి గురించి చెప్పాలంటే, ఆయ‌న్ని మిస్ చేసి ఏడాదిన్న‌ర అవుతుంది. ఆయ‌న్ని ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాను. ఆయన ఎందుకంటే కాలం విలువ తెలిసిన హీరో. ఆయన దగ్గరనుంచి చి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా కాలం తర్వాత ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. కాబ‌ట్టి ప్రేక్ష‌కుల్లాగా నేను కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను`` అన్నారు.

 

*లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ఎ.సుభాస్క‌ర‌న్ మాట్లాడుతూ* - ``2.0`త‌ర్వాత ర‌జినీకాంత్‌గారితో మా బ్యాన‌ర్‌లో చేసిన చిత్ర‌మిది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌గారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమా అంద‌రినీ మెప్పించేలా, మా బ్యాన‌ర్‌కు మంచి పేరు తెస్తుంది. మురుగ‌దాస్‌గారికి థ్యాంక్స్‌. అనిరుద్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. సంతోశ్ శివ‌న్‌గారికి, శ్రీక‌ర్ ప్ర‌సాద్‌గారు స‌హా అంద‌రికీ ప్రత్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ మాట్లాడుతూ - ``నేను ర‌జినీకాంత్‌గారికి వీరాభిమానిని. 8 ఏళ్ల ముందు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా న‌న్ను ధ‌న‌ష్‌గారు గుర్తించారు. ఆయ‌న‌కు ముందుగా థ్యాంక్స్‌. అప్పుడు ర‌జినీకాంత్‌గారి సినిమాకు ప‌నిచేయాల‌ని క‌ల క‌న్నాను. ఆ క‌ల ఒక‌సారి కాదు.. రెండు సార్లు నిజ‌మైంది. సినిమా రీ రికార్డింగ్ కూడా పూర్త‌య్యింది. రీ రికార్డింగ్ పూర్త‌యిన‌ప్పుడు ఎమోష‌న‌ల్‌గా అనిపించింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా చిన్న చిన్న సినిమాల‌కు ప‌ని చేస్తున్న త‌రుణంలో ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌గారు నాలో ప్ర‌తిభ‌ను గుర్తించి క‌త్తి సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. అది నాకు పెద్ద బ్రేక్ అయ్యింది. అలా నేను పెద్ద సినిమాల‌కు వ‌ర్క్ చేశాను. అయితే ర‌జినీగారితో తొలిసారి `పేట‌` సినిమాకు ప‌నిచేశాను. ద‌ర్బార్ సినిమాకు ఆయ‌న‌తో క‌ల‌సి రెండోసారి క‌లిసి ప‌నిచేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి. గొప్ప జ‌ర్నీ. ఈ అవ‌కాశం ఇచ్చిన మురుగ‌దాస్‌గారికి, సుభాస్క‌ర‌న్‌గారికి ధ‌న్య‌వాదాలు`` అన్నారు. బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి మాట్లాడుతూ - ``నేను ద‌క్షిణాది స్టార్స్‌లో ర‌జినీకాంత్‌గారితో కలిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆయ‌న‌తో ప‌నిచేయాల‌ని క‌ల క‌న్నాను. ఈరోజు ఆ క‌ల నేర‌వేరింది. ఈ సినిమా స్క్రిప్ట్ చెప్ప‌డానికి మురుగ‌దాస్‌గారు రాగానే, విన్నాను. ఏమాత్రం ఆలోచించ‌కుండా ఓకే అన్నాను. అయితే ఆయ‌న్ని మురుగ‌దాస్‌గారిని ఓ మాట అన్నాను. `ఈ సినిమా త‌ర్వాత ద‌క్షిణాదికి నేను భ‌యం లేకుండా రావ‌చ్చు క‌దా!` అన్నాను. నా పాత్ర‌ను మురుగ‌దాస్‌గారు అంత బాగా డిజైన్ చేశారు. నేను ఇక్క‌డ అభిమానుల్లాగానే ఆయ‌న్ని అభిమానించి ఈ సినిమాలో న‌టించాను. ఈ అవ‌కాశం ఇచ్చిన సుభాస్క‌ర‌న్‌గారికి, మురుగ‌దాస్‌గారికి, స‌పోర్ట్ చేసిన ఎంటైర్ యూనిట్‌కి థ్యాంక్స్‌`` అన్నారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో నివేదా థామ‌స్‌, రాఘవ లారెన్స్‌, అరుణ్ విజ‌య్‌, వివేక్, సంతోశ్ శివన్, లతా రజనీకాంత్, సౌందర్య రజినీ కాంత్, ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్‌, విశ‌గ‌న్‌, ప్రేమ సుభాస్క‌ర‌న్‌, ర‌మ్యా మురుగ‌దాస్‌, పీవీఆర్ నైనా త‌దిత‌రులు పాల్గొన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS