పవన్ కల్యాణ్ తో `పింక్` సినిమాకి రీమేక్ చేయాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వచ్చాయి. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకొక్కరుగా వస్తున్నారు. తాప్సి పాత్ర పూజా హెగ్డేకి దక్కిందని ప్రచారం జరిగింది. అయితే... ఇప్పుడు పూజా స్థానంలో సమంత వచ్చి చేరినట్టు తెలుస్తోంది. పూజా కంటే సమంత అయితే ఈ పాత్రకు మరింత న్యాయం జరుగుతుందని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం.
పైగా సమంత కూడా ఈమధ్య కమర్షియల్ సినిమాలవైపు దృష్టి పెట్టడం లేదు. కథాబలం ఉన్న పాత్రలే ఎంచుకుంటోంది. అందుకే.. `పింక్` రీమేక్‌లో సమంత వచ్చి చేరడం ఖాయం అనిపిస్తోంది. బోనీకపూర్, దిల్‌రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2020 ప్రధమార్థంలో పట్టాలెక్కబోతోంది. ఈలోగా కథానాయిక ఎవరన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.