సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందుతోన్న క్రేజీ మూవీ 'దర్బార్'. కాగా రజిని పోలీస్ ఆఫీసర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ముంబై లోని మాఫియా లీడర్స్ పై ఒక పోలీస్ చేసే పోరాటమే దర్బార్ కథ అని తెలుస్తుంది. అందుకే షూటింగ్ మేజర్ పార్ట్ మొత్తం ముంబైలో చిత్రీకరించడం జరిగింది. ఇక ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే మెగా ఈవెంట్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది.
తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం దర్బార్ చిత్రం ఆడియో విడుదల వేడుకను గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. కాగా ఈ నెల 7న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆడియో విడుదల కార్యక్రమం భారీగా నిర్వహించడానికి నిర్మాతలు ఇప్పటికే తలపెట్టారు. 7వ తేదీ సాయంత్రం 5గంటల నుండి వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ వేడుకకు ఓ స్టార్ హీరో రాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ స్టార్ హీరో ఎవరో చూడాలి.
వేలాదిగా రజిని అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దర్బార్ మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందిస్తున్నారు. ఇటివలే విడుదలైన రజిని ఇంట్రడక్షన్ సాంగ్ రజిని అభిమానులను అలరించింది. ఈ సినిమాలో రజనీకి జోడీగా నయనతార కథానాయకిగా నటిస్తోంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరొక నటి నివేత థామస్ సైతం ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.