ప్రచారంలో 'తలైవా' భారీతనమే వేరయా.!

By Inkmantra - January 03, 2020 - 11:20 AM IST

మరిన్ని వార్తలు

గతంలో రజనీకాంత్‌ నటించిన 'కబాలి' చిత్రాన్ని ఏ రేంజ్‌లో ప్రచారం చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్‌ స్టార్‌ బొమ్మలు, సూపర్‌ స్టార్‌ చాక్లెట్లు.. ఆఖరికి విమానాలపై కూడా 'కబాలి' పోస్టర్స్‌తో విసృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే, ఆ సినిమా రజనీకాంత్‌ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచింది. కానీ, ప్రమోషన్స్‌లో ఆ సినిమాదే అగ్రస్థానంగా పరిగణించాలేమో. ఇక ఇప్పుడు రజనీకాంత్‌ నటించిన 'దర్బార్‌' ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. జనవరి 9న 'దర్బార్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచింది చిత్ర యూనిట్‌.

 

డిఫరెంట్‌ పోజుల్లో రజనీ స్టిల్స్‌ రిలీజ్‌ చేయడంతో పాటు, తాజాగా 'దర్బార్‌' పోస్టర్లు విమానాలపై కూడా ప్రచారానికి సిద్ధమయ్యాయి. తొలిసారి 'కబాలి'తోనే ఈ తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మళ్లీ ఆయన సినిమాకే ఇలా ప్రమోషన్‌ చేయడం విశేషం. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సినిమా నిర్మాణంతో పాటు, ప్రమోషన్స్‌లోనూ ఏమాత్రం రాజీ పడడం లేదు.. అనేది ఈ విమాన ప్రచారం చూస్తేనే అర్ధమవుతోంది. ఇక ఇంతవరకూ విడుదలైన పోస్టర్లలో రజనీకాంత్‌ మాస్‌ స్టైల్‌ ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది. చాలా కాలం తర్వాత పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తున్నారు ఈ సినిమాలో రజనీకాంత్‌. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో 'జెంటిల్‌మెన్‌' బ్యూటీ నివేదా థామస్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS