శ్రీముఖికి ఆ ఉద్దేశ్యం లేదా?

మరిన్ని వార్తలు

బుల్లితెర రాములమ్మగా బోలెడంత క్రేజ్‌ ఉన్న ముద్దుగుమ్మ శ్రీముఖికి బిగ్‌బాస్‌ కారణంగా ఆ క్రేజ్‌ మరింత పెరిగింది. బిగ్‌బాస్‌ రన్నర్‌గా బయటికి వచ్చిన తర్వాత ఆమె సినిమాల్లో తెగ బిజీ అయిపోతుందని అనుకున్నారంతా. అందుకు కారణం, హౌస్‌లో ఉన్నప్పుడు శ్రీముఖి పట్ల ఉన్న క్రేజే. అయితే, బయటికొచ్చాక శ్రీముఖి ఎక్కువగా టీవీ షోలపైనే ఫోకస్‌ పెడుతున్నట్లు కనిపిస్తోంది. అంటే, సినిమాల్లో నటించే ఆసక్తి లేదా? గతంలోనూ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అనుభవం ఉంది శ్రీముఖికి.

 

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడే హీరోయిన్‌గా కొన్ని సినిమాలకు సైన్‌ చేసిందనే ప్రచారం కూడా ఉంది. అయితే, ఆ సినిమాల సంగతేంటో తెలీదు కానీ, ప్రస్తుతం టీవీ షోస్‌తో పాటు, సోషల్‌ మీడియాని ఫుల్‌గా హీటెక్కించేస్తోంది. రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోలు పోస్ట్‌ చేస్తోంది. లేటెస్ట్‌గా పోస్ట్‌ చేసిన రెడ్‌ హాట్‌ పిక్స్‌ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. శ్రీముఖి ఈ గ్లామర్‌ షో చూసి, సినిమాల్లో ట్రై చేసేందుకు ఇదంతా చేస్తోందంటున్నారు. కానీ, శ్రీముఖికి ఆ ఉద్దేశ్యం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

శ్రీముఖి యస్‌ అంటే, ఆమెతో సినిమా తీసి, ఆమె క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి కొందరు దర్శక, నిర్మాతలు రెడీగా ఉన్నారట. అయినా శ్రీముఖి నుండి సరైన సిగ్నల్‌ రావడం లేదట. ఏది ఏమైతేనేం, శ్రీముఖి చాలా తెలివైంది. తనకు బుల్లితెరపైనే ఎక్కువ ఇమేజ్‌ ఉందని గ్రహించిందో ఏమో, ఆ ఇమేజ్‌ని ఇంతై, వటుడింతై.. అన్నట్లుగా పెంచుకోవాలనుకుంటోందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS