దాసరి నారాయణరావు ఇంట్లో ఆస్తి తగాదాలు మొదలై, అవి పోలీసు స్టేషన్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. అన్నయ్య దాసరి ప్రభు ఇంటి ముందు అర్థరాత్రి అరుణ్ కుమార్ వీరంగం చేయడం, గేటు దూకి వెళ్లడం.. దాంతో ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేయడం టాలీవుడ్ లో చర్చనీయాంశాలయ్యాయి. ఈ విషయాలపై దాసరి అరుణ్ కుమార్ స్పందించారు.
ఆ ఇంటిపై ప్రభుకి ఎంత హక్కు ఉందో, తనకీ అంతే హక్కు ఉందని, ఆ ఇల్లు తనదని ఏమైనా ధృవీకరణ పత్రాలు ఉంటే చూపించాలని, తన తండ్రి రాసిన వీలునామా కూడా చూపించాలని డిమాండ్ చేశారు. తన ఇంటి గోడ దూకితే తప్పేం లేదని చెప్పుకొచ్చారు. ఏదైనా సరే, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, న్యాయ స్థానం లో పరిష్కారం దొరుకుతుందనుకుంటే తాను అందుకు కూడా సిద్ధమే అని, చిత్రసీమ పెద్దలు ఈ వివాదాన్ని పరిష్కరిస్తానంటే దానికీ ఓకే అని అన్నారు. తండ్రి ఆస్తుల్ని అమ్మేస్తున్నాడని ప్రభు అరుణ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తండ్రి ఆస్తుల్ని తాను అమ్మలేదని, అ అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు అరుణ్.