త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెల్సిందే. ‘బాహుబలి’ తర్వాతి స్థానంలో నిలిచింది వసూళ్ళ పరంగా ‘అల వైకుంఠపురములో’ సినిమా. ఇక, ఈ సినిమాలో పాటల గురించి కొత్తగా చెప్పేదేముంది.? యూ ట్యూబ్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు కొల్లగొడుతూనే వున్నాయి దాదాపుగా పాటలన్నీ. మరీ ముఖ్యంగా ‘బుట్టబొమ్మ’ సాంగ్ అయితే, సంచలనాలకు మారు పేరుగా మారిపోయింది.
టిక్‌టాక్‌లో ఈ పాటకే ఎక్కువమంది డాన్సులేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి ‘బుట్టబొమ్మ’ పాటకి డాన్స్ చేశాడు. ఈ టిక్‌టాక్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది. అన్నట్టు, ఈ వీడియోలో డేవిడ్ వార్నర్ ఆయన భార్య మాత్రమే కాదు, వారి ముద్దుల చిన్నారి కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడం గమనార్హం. డేవిడ్ వార్నర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైద్రాబాద్ జట్టులో కీలక ఆటగాడు. ఆ జెర్సీతోనే ‘బుట్టబొమ్మ’ పాటకు చిందేశాడు డేవిడ్ వార్నర్. అచ్చంగా ‘బుట్టబొమ్మ’ పాటలోని స్టెప్పుల్నే డేవిడ్ వార్నర్, ఆయన భార్య దించేశారు టిక్‌టాక్ వీడియోలో. అల్లు అర్జున్ సరసన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. అచ్చంగా పూజా హెగ్దే, బుట్టబొమ్మ పాటలో కన్పించినట్లే.. క్యూట్ గౌన్‌లో డేవిడ్ వార్నర్ భార్య కన్పించడం మరో విశేషం.