‘బుట్టబొమ్మ’కి ఫిదా అయిన మరో క్రికెటర్‌.

మరిన్ని వార్తలు

‘అల వైకుంఠపురములో’ సినిమా మేనియా ఇంకా కొనసాగుతూనే వుంది. మరీ ముఖ్యంగా సినిమాలోని పాటలు ఓ రేంజ్‌లో పాపులారిటీని పెంచుకుంటూ పోతున్నాయి. ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌, ‘అల వైకుంఠపురములో’ పాటలకి డాన్సులు వేస్తూ, టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తోన్న విషయం విదితమే. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ చేరిపోయాడు. కెవిన్‌ పీటర్సన్‌, ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకి డాన్సులేస్తూ, టిక్‌టాక్‌ వీడియో రిలీజ్‌ చేశాడు. ఇదిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. షర్ట్‌ లెస్‌గా ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి కెవిన్‌ పీటర్‌సన్‌ డాన్సులేస్తోంటే, ఆయన అభిమానులు మురిసిపోతున్నారు.

 

ఇంగ్లాండ్‌ జట్టు తరఫున క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించాడు కెవిన్‌ పీటర్‌సన్‌. అతనికి ఇండియాలోనూ బోల్డంతమంది అభిమానులున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నేపథ్యంలో క్రికెటర్ల బౌండరీలూ మారిపోయాయి. ఇదిలా వుంటే, ‘అల వైకుంఠపురములో’ పాటలు సృష్టిస్తోన్న ఈ నయా ట్రెండ్‌ చూసి హీరో అల్లు అర్జున్‌ ఆనందాశ్చర్యాలకు లోనవుతున్నాడు. పేరు పేరునా ఒక్కొక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ వెళుతున్నాడు అల్లు అర్జున్‌. త్రివిక్రవ్‌ు శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే.

@kevinpietersen

##tictok ##dance ##tiktokindia 🕺🕺🕺Am I getting any better???

♬ original sound - SwAmy PriyAzz💕

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS