మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాంగ్ లో సూపర్ స్టార్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. దేవి శ్రీ బీట్ కి.. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులను రష్మిక, మహేష్ బాబు మరో రేంజ్ కి తీసుకెళ్లారు. మైండ్ బ్లాక్ డాన్స్ కవర్స్ మరియు యూట్యూబ్ వ్యూస్ చూస్తే చెప్పొచ్చు ఈ సాంగ్ ఏ రేంజ్ లో నచ్చేసిందో.
ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ 'డేవిడ్ వార్నర్' తన సతీమణి తో ఈ సాంగ్ కు స్టెప్పులేసి అందరినీ మైండ్ బ్లాక్ చేసాడు. అయితే ఈ స్టెప్పులేయడానికి వీళ్ళు 51 టేకులు తీసుకున్నారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీనితో మహేష్ ఫ్యాన్స్ మరోసారి కాలర్ ఎగరెయ్యడం స్టార్ట్ చేసారు.
Attempt 51 haha part 1 of @urstrulyMahesh #mindblock @CandyFalzon pic.twitter.com/AYrRVD3ooX
— David Warner (@davidwarner31) May 30, 2020