బిగ్‌బాస్‌లో మూడో రోజు టాస్క్‌లో భాగంగా హౌస్ మేట్స్ తమ బాల్యం నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకునే టాస్క్ ఇచ్చారు. 5 నుండి 10 ఏళ్ల లోపు వయసున్న పిల్లల మాదిరి హౌస్ మేట్స్ మారిపోవాలని సూచించారు. ఇంక అంతే హౌస్ అంతా రచ్చ రంభోలా అయిపోయింది. రోహిణి, శ్రీముఖి, ఆలీ, రవి, బాబా భాస్కర్, హేమ తదితరులు చిన్న పిల్లల అవతారమెత్తి, హౌస్ అంతా లొల్లి లొల్లి చేశారు.
రోహిణి, శ్రీముఖి సంగతి చెప్పనే అక్కర్లేదు. రోహిణి మరీ చిన్న పిల్లలా నేల మీద పడి ఏడ్వడం, బొమ్మల కోసం మారాం చేయడం వంటి పిచ్చి చేష్టలెన్నో చేసి, విసిగెత్తించింది. ఇక శ్రీముఖి సంగతి చెప్పాలా.? పునర్నవి, వరుణ్ సందేశ్‌లను కేర్ టేకర్స్‌గా నియమించారు బిగ్‌బాస్. కేర్ టేకర్ అయిన పునర్నవి మైక్ దాచేసి, శ్రీముఖి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు, ఇక బాత్రూమ్ ఇష్యూలో బాబా భాస్కర్ కూడా శృతి మించి అల్లరి చేశారు. చిన్న పిల్లల టాస్క్ పేరు చెప్పి, పిచ్చి వాళ్లయిపోయిన వీరిని కంట్రోల్ చేయడం పునర్నవికీ, వరుణ్ సందేశ్‌కీ చాలా కష్టమైపోయింది. అయితే, ఇదే టాస్క్‌లో ఆసక్తికరమైన అలజడి కూడా చోటు చేసుకుంది.
మహేష్ విట్టా ఉన్నాడు కదా.. ఆయనపై కర్రోడు కర్రోడు అంటూ రోహిణీ, రవి కామెంట్లు వేస్తూ పిచ్చితనం ప్రదర్శించారు. టాస్క్‌లో భాగంగానే అయినా, ఈ పిచ్చితనం నచ్చని మహేష్ అలక పాన్పు ఎక్కాడు. చిన్నతనం నుండీ నేను సైలెంటే అనీ, అయినా బిగ్‌బాస్ చిన్నపిల్లల్లా యాక్ట్ చేయమన్నారు కానీ, ఓవర్ యాక్టింగ్ చేయమనలేదనీ, టాస్క్ పేరు చెప్పి, పిచ్చితనం ప్రదర్శించే సంస్కారం తనది కాదనీ కోప్పడ్డాడు. అలా మూడో రోజు బిగ్‌బాస్‌లో మహేష్ ఇష్యూ హైలైట్‌గా నిలిచింది.