'కామ్రేడ్‌' కోసం స్పెషల్‌ ఆంథెమ్‌: ఇది వెరీ వెరీ స్పెషల్‌ బాస్‌.!

By iQlikMovies - July 18, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

ఈ నెల 26న విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్‌ ఫెస్టివల్‌ పేరుతో సౌత్‌ భాషలన్నింట్లోనూ ప్రచారం చేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ ఈ సినిమాని. 'నోటా'తో కోలీవుడ్‌కి పరిచయమైన విజయ్‌ దేవరకొండ ఈ సారి సౌత్‌ భాషలన్నింటినీ టార్గెట్‌ చేశాడు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది.

 

తాజా ప్రమోషన్స్‌లో భాగంగా, 'కామ్రేడ్‌' ఆంథెమ్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేయనున్నారు. ఈ సాంగ్‌కి చాలా ప్రత్యేకతలున్నాయి. తెలుగులో ఈ సాంగ్‌ని విజయదేవరకొండ ఆలపిస్తుండగా, తమిళంలో విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి గొంతు కలిపారు. ఇక మలయాళ విషయానికి వస్తే, దుల్కర్‌ సల్మాన్‌ ఆలపించాడు. మరికొద్ది సేపట్లో రానున్న ఈ సాంగ్‌ కామ్రేడ్‌పై అంచనాల్ని మరింత పెంచేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, సాంగ్‌ ప్రోమోస్‌ 'డియర్‌ కామ్రేడ్‌'పై అంచనాలు పెంచేశాయి. ఇక ముందు జరగబోయే ప్రమోషన్స్‌తో ఆ అంచనాల్ని మరింత పెంచే దిశగా విజయ్‌ దేవరకొండ రంగం సిద్ధం చేస్తున్నాడట. మైత్రీ మూవీస్‌ ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మికా హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS