'జనసేన' కాదిది 'జై సేన'.!

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన రాజకీయ పార్టీ పేరు జనసేన. ఇది అందరికీ తెలిసిందే. కానీ మనం ఇప్పుడు 'జై సేన' గురించి డిస్కస్‌ చేస్తున్నాం. అసలేంటీ.? 'జై సేన' అంటే.. ఇదో సినిమా టైటిల్‌. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్‌ని హ్యాండ్‌సమ్‌ హీరో గోపీచంద్‌ రేపు సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ చేయబోతున్నారు. అయితే, సినిమా కథా కమామిషు ఏంటనే సంగతులు మాత్రం ఆడక్కండి. కానీ, జరుగుతోన్న ప్రచారం ప్రకారం ఈ సినిమా పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీకి మద్ధతుగానే ఉండబోతోందనీ తెలుస్తోంది.

 

సినిమా ప్రమోషన్స్‌ కూడా అదే యాంగిల్‌లో చేస్తున్నారు. మరి టీజర్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగానే రిలీజ్‌ చేద్దామనుకున్నారట. కానీ, టెక్నికల్‌గా కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో గోపీచంద్‌తో ఈ టీజర్‌ రిలీజ్‌ చేయిస్తున్నారు. టైటిల్‌ లోగోలో బిగించిన పిడికిలి గుర్తు కనిపిస్తోంది. జనసేనకు మద్దతుగా సినిమా అంటే, ఈ సినిమాలో ఏం చూపిస్తారా.? అనే ఆసక్తి అప్పుడే అందరిలోనూ నెలకొంది.

 

ఈ సినిమాలో సునీల్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరో, హీరోయిన్ల విషయం కూడా తెలీదు కానీ, సునీల్‌, శ్రీకాంత్‌ పేర్లు మాత్రమే ప్రస్తుతానికి ప్రస్థావనకొచ్చాయి. వి.సముద్ర దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'జై సేన' విషయమేంటా? అని తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం 4 గంటల వరకూ వేచి చూడాల్సిందే. టీజర్‌ వచ్చాక అసలు ఈ సినిమా ముచ్చటేంటో అర్ధమువుతుంది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS