రాజమౌళి అమెరికా వెళ్లిందెందుకంటే!

మరిన్ని వార్తలు

ఈ మధ్య రాజమౌళి అమెరికా టూర్‌ గురించి ఆశక్తికరమైన చర్చ నడిచింది. అయితే, అసలెందుకు రాజమౌళి అమెరికా వెళ్లారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఆ టైంలో జరుగుతున్న తానా సభల కోసమేమో అని భావించిన అభిమానుల కోసం, తాను తానాకి రావడం లేదని అయితే రాజమౌళి చెప్పారు. కానీ, ఆయన టూర్‌ విషయమై ఇంత చర్చ నడుస్తున్నా, అసలు విషయంలో ఆయన రెస్పాండ్‌ కాలేదు. అయితే, ఇటీవల 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకి సంబంధించి ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ ఒకటి ఆ నోటా ఈ నోటా బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

 

అదే ఎన్టీఆర్‌ సరసన నటించబోయే హీరోయిన్‌ పేరు. ఎమ్మా రాబర్ట్స్‌ అనే విదేశీ యువతిని రాజమౌళి అండ్‌ టీమ్‌ వెతికి పట్టుకుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికీ, రాజమౌళి అమెరికా టూర్‌కీ ఖచ్చితంగా లింక్‌ ఉండే ఉంటుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఎమ్మాకి 'ఆర్‌ఆర్‌ఆర్‌' కథ వినిపించేందుకే రాజమౌళి అమెరికాకి వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు.

 

అయితే, ఇది కూడా అనుకోవడమే, రాజమౌళి అన్నది మాత్రం కాదు. రాజమౌళి అమెరికా ప్రయాణం నిజంగానే ఈ విదేశీ భామని కన్‌ఫామ్‌ చేయడానికైతే, 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ ఇకపై శరవేగంగా జరుగుతుందిలే అని ఫ్యాన్స్‌ సంతోష పడుతున్నారు. గాయాల నుండి కోలుకున్న ఎన్టీఆర్‌, చరణ్‌ ఇటీవలే సెట్స్‌లో అడుగుపెట్టారనీ, షూటింగ్‌ స్పీడ్‌గా జరుగుతోందనీ తెలుస్తోంది. జక్కన్న టీమ్‌ ఇంకా అధికారికంగా కన్‌ఫామ్‌ చేయలేదు. కానీ, ఈ విదేశీ భామ కూడా అతి త్వరలోనే సెట్స్‌లో సందడి చేయనుందనీ తాజా సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS