తెలుగు పాట‌లో పాప్ మిక్స్ చేశారు కామ్రేడ్‌!

By iQlikMovies - July 18, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

వ‌చ్చేవారం విడుద‌ల కానున్న `డియ‌ర్ కామ్రేడ్‌`పై అంద‌రి క‌ళ్లూ ఉన్నాయి. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా ఇది. అంతే కాదు... గీత గోవిందంతో అద‌ర‌గొట్టిన ర‌ష్మిక మ‌రోసారి విజ‌య్‌తో జోడీ క‌ట్టింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌నీ ప‌క్కాగా ప్లాన్ చేస్తోంది చిత్ర‌బృందం. ఇప్పుడు కామ్రేడ్ ఆంథ‌మ్ సాంగ్ అంటూ ఒక‌టి విడుద‌ల చేశారు. ఈ పాట‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా గొంతు క‌లిపాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ డియ‌ర్ కామ్రేడ్‌లో ఒక్కో పాట ఒక్కో త‌ర‌హాలో సాగింది.

 

ప్రేమ గీతం, క్యాంటీన్ పాట‌, విర‌హ రాగం.. ఇలా అన్నీ ఉన్నాయి. ఇది మ‌రో త‌ర‌హా గీతం. ఈ పాట యువ‌త‌రానికి న‌చ్చేలా కంపోజ్ చేశాడు సంగీత ద‌ర్శ‌కుడు. పాట‌లో ర్యాప్ కూడా క‌ల‌గ‌లిసింది. పాప్‌, రాప్ మిక్స్ చేస్తూ తెలుగులో ఓ పాట రావ‌డం నిజంగానే అరుదైన విష‌యం. యువ‌త‌రంలో, ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల‌లో పోరాటం, స్ఫూర్తి నింపేలా ఈ గీతం ఉంది. చైత‌న్య కృష్ణ అందించిన ఈ పాట‌లోని సాహిత్యం, ట్యూన్‌లో మిక్స్ అయిపోయి... అర్ధం కావ‌డానికి కాస్త క‌ష్టంగా ఉంది. కాక‌పోతే... థియేట‌ర్లో స‌రైన టైమ్ లో ఈ పాట ప్లే చేస్తే... కుర్రకారుకి కొత్త ఉత్సాహం వ‌చ్చే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS