సుధీర్‌బాబు బ్యాడ్మింటన్‌ టాలెంట్‌ చూశారా?

మరిన్ని వార్తలు

వెయిట్‌ లిఫ్టింగ్‌ అనీ, ఐస్‌ వాటర్‌ ఛాలెంజ్‌ అనీ రకరకాల ఛాలెంజ్‌లు ఆ మధ్య హల్‌చల్‌ చేశాయి. సినీ సెలబ్రిటీలు, పొలిటికల్‌ సెలబ్రిటీలూ.. ఈ సెలబ్రిటీలు, ఆ సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఆ ఛాలెంజ్‌ని అందరూ స్వీకరించి తమ తమ టాలెంట్‌ చూపించేశారు. ఆ కోవలో ప్రజెంట్‌ ట్రెండింగ్‌లో ఉన్న ఛాలెంజ్‌ 'బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌'. ఈ చాలెంజ్‌నీ చాలా మంది సెలబ్రిటీలు తమదైన శైలిలో చేసి చూపించేశారు. సామాన్యులు కూడా ఫన్నీ క్రియేటివిటీతో ఈ ఛాలెంజ్‌ పూర్తి చేసి, ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, భళా అనిపించుకున్నారు.

 

అయితే, అందరి టాలెంట్‌ వేరు. మన హీరో సుధీర్‌ బాబు టాలెంట్‌ వేరు. ఈయన ఇదే ఛాలెంజ్‌ని పలు రకాలుగా ప్రదర్శించి చూపించారు. సుధీర్‌బాబు బ్యాండ్మింటన్‌లో సిద్ధహస్థుడన్న సంగతి తెలిసిందే కదా. తన బ్యాడ్మింటన్‌ టాలెంట్‌ని ఈ బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌లో ఉపయోగించాడు. బ్యాడ్మింటన్‌ కాక్‌తో బాటిల్‌ క్యాప్‌ ఓపెన్‌ చేసి, ఆ బాటిల్‌లోని వాటర్‌ తాగుతున్న వీడియో వైరల్‌ అయ్యింది. అక్కడితో ఆగలేదు మనోడు. ఫిట్‌నెస్‌కీ మనోడు పర్‌ఫెక్ట్‌ ఫిట్‌ కదా. తన ఫిట్‌నెస్‌తో అందరూ చేసినట్లుగానే గుండ్రంగా తిరిగి రివర్స్‌లో కాలితో బాటిల్‌ క్యాప్‌ ఓపెన్‌ చేశాడు. అయితే, ఒక్క బాటిల్‌ కాదు, ఎట్‌ ఏ టైమ్‌ రెండు బాటిల్స్‌ క్యాప్స్‌ ఓపెన్‌ చేసి సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించుకున్నాడు. దటీజ్‌ సుధీర్‌బాబు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS