బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ని చంపేస్తామంటూ జోద్ పూర్ కి చెందిన ఒక గ్యాంగ్ స్టర్ బెదిరించిన సంగతి విదితమే.
అయితే ఇప్పుడు ఏకంగా అ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ని అంతమొందించడానికి ఏకంగా ముంబై వచ్చినట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇది తెలిసిన ముంబై పోలీసులు షూటింగ్ లో ఉన్న సల్మాన్ ఖాన్ ని హుటాహుటిన బాంద్రాలోని ఆయన ఇంటికి తరలించారు. ఈ విషయమై సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కూడా ఈ హెచ్చరికల వచ్చినట్టు దృవీకరించారు.
ఇంతకి సల్మాన్ ఖాన్ ని చంపుతాను అంటూ ప్రకటించిన గ్యాంగ్ స్టర్ పేరు- లారెన్స్ బిశ్నోయి. కారణమేంటంటే- సల్మాన్ ఖాన్ జోద్ పూర్ లో చంపినట్టుగా కేసు నమోదు అయిన కృష్ణజింకని లారెన్స్ వంశస్థులు కృష్ణజింకని తమ దైవంగా భావిస్తుంటారు. అందుకే ఆ కృష్ణజింకని చంపిన కారణంగా సల్మాన్ ఖాన్ ని చంపి ప్రతీకారం తీర్చుకుంటాము అని లారెన్స్ ప్రకటించాడు.
ఇక ఈ బెదిరింపుల నేపధ్యంలో సల్మాన్ ఖాన్ కి భద్రతని పెద్ద సంఖ్యలో పెంచినట్టు ముంబై పోలీసులు తెలిపారు.