కెప్టెన్ అవ్వాల్సిందెవరు.? కష్టపడిందెవరు.? చిత్రమైన టాస్క్ కదా.! కెప్టెన్ అవ్వాలనుకున్న వ్యక్తి, తనను భుజాల మీద మోసే వ్యక్తిని సెలక్ట్ చేసుకోవాలి. అలా ఎవరో ఒకరు కెప్టెన్సీ పోటీదారుల్ని గనుక తమ భుజాల మీద నిర్దేశిత సమయాన్ని మోయగలిగితే, ఆ భుజమ్మీదనున్న వ్యక్తి గెలిచేస్తాడు. ఇదీ టాస్క్. కెప్టెన్ అవ్వాలనుకున్న వ్యక్తి పోరాడటం కాదిక్కడ.. కెప్టెన్ కోసం ఇతర హౌస్‌మేట్స్ కష్టపడటమే అసలు టాస్క్. ఇదేం టాస్కో ఏమోగానీ.. హారికని ఎలాగోలా కెప్టెన్‌ని చేసేశాడు బిగ్‌బాస్. ఇది ముందు ఊహించినదే. అందరూ ఊహించినట్లుగానే ఆమె గెలిచేసింది. ఈమాత్రందానికి డైరెక్ట్‌గా కెప్టెన్‌ని బిగ్‌బాస్ ఎంపిక చేసేసినట్లు ప్రకటించేసి వుంటే బావుండేది.
ఈ సీజన్‌లో ఇది అతి పెద్ద కామెడీ టాస్క్ అయ్యింది కెప్టెన్సీ సందర్భంగా. లేకపోతే, మోనాల్ భుజమ్మీదికి హారిక ఎక్కడమేంటి.? ఇద్దరి మధ్యా సరైన కెమిస్ట్రీనే లేదు ఇప్పటిదాకా. బిగ్‌బాస్‌లో ఏమైనా జరగొచ్చు.. ఎందుకంటే, అంతా బిగ్‌బాస్ అనుకున్నట్టే జరుగుతుంది గనుక. కానీ, కామెడీ ఏంటంటే.. బిగ్‌బాస్ ఏం అనుకుంటాడో జనానికి ముందే తెలిసిపోతుంది. ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు.? అన్న విషయమై మొదటి వారం నుంచీ జరుగుతున్న ప్రిడిక్షన్స్ అన్నీ నిజమయ్యాయి. కెప్టెన్సీలూ అంతే. గత సీజన్లలో ఎప్పుడూ లేని చిత్రమిది.