బాలీవుడ్ నటి దీపికా పడుకొనే, బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యెదుట విచారణకు హాజరు కానుంది. డ్రగ్స్ వివాదానికి సంబంధించి ‘కేంద్ర బిందువు’గా మారుతున్న ఓ వాట్సాప్ గ్రూపుకి దీపికా పడుకొనే అడ్మిన్‌గా వుందన్న విషయం బయటకు పొక్కింది. ఈ వాట్సాప్ గ్రూపులోనే డ్రగ్స్ గురించిన ఛాటింగ్ జరిగిందట పలువురు సినీ ప్రముఖుల మధ్య. దాంతో, ఆమెను విచారణకు పిలిచిందట ఎన్సీబీ. మరోపక్క, దీపికకి డ్రగ్స్‌తో సంబంధమే లేదంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఉద్యమం లేవనెత్తారు. దీపిక భర్త రణ్‌వీర్ సింగ్, తన భార్యతోపాటుగా విచారణకు హాజరవుతానని అంటున్నాడు.
దీనిపై ఎన్‌సిబి ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ వెల్లడించలేదు. కాగా, గతంలో దీపికా పడుకొనే డిప్రెషన్‌కి లోనయ్యింది. ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించింది. అది ఒక అనారోగ్య సమస్యగా మారి.. చాలాకాలం బాధపడింది కూడా. ఓ దశలో ఆమె ఆత్మహత్యకూ యత్నించింది. ఇవన్నీ డ్రగ్స్ కారణంగానేనన్న విమర్శలున్నాయి. దీపికా పడుకొనే, పలువురు యంగ్ హీరోలతో ప్రేమలో పడి, ఆ ప్రేమలో విఫలమై.. డ్రగ్స్‌కి బానిసగా మారిందిన అప్పట్లో ప్రచారం జరిగింది.
ఆనాటి ఆ వ్యవహారాలన్నిటినీ ఇప్పుడు ఎన్‌సిబి విచారణలో తిరగతోడే అవకాశం వుందట. అయితే, ఎన్‌సిబి విచారణ అనేది ఓ సాధారణ ప్రక్రియ అనీ, రియాతో ప్రత్యక్షంగా పరోక్షంగా వున్న సినీ సంబంధాల కారణంగానే దీపికను విచారణకు పిలిచారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.