ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజీపై ఇదిగో ఇలా హాట్ హాట్ అందాలతో మెరిసింది దీపికా పదుకొనె. ఈ మధ్య 'పద్మావత్' సినిమా విషయమై పలు వివాదాలను ఎదుర్కొన్న ముద్దుగుమ్మ దీపికా పదుకొనె, ఎట్టకేలకు ఆ సినిమాతో మంచి విజయం అందుకుంది. వసూళ్ల పరంగా సంచలనాలే నమోదు చేసింది. ఆ సినిమాలో రాణి పాత్రలో ఒంటి నిండా మోయలేని నగలు, బరువైన దుస్తులతో మెరిసిపోయిన దీపికా, ఇప్పుడు ఇలా హాట్ హాట్ కాస్ట్యూమ్‌తో స్కిన్ షో చేసేస్తోంది. రాణిలా కనిపించినా దీపికకు క్రేజ్ తగ్గదు. అలాగే హాట్ షో చేసినా దీపికా క్రేజ్ తగ్గదు. ఆమె చూపుల్లోనే ఎన్నో ఎక్స్‌ప్రెషన్స్ పండించగలదు. కళ్లే మాట్లాడుతాయి దీపికలో. ఆ కళ్లతోనే సెక్సప్పీల్ అయినా ఇంకే ఇతర బరువైన ఎక్స్‌ప్రెషన్ అయినా ఇట్టే పండించగల సత్తా ఆమెలో ఉంది. ఆ కళ్లలోని బ్రైట్‌నెస్సే దీపిక గ్లామర్ సీక్రెట్.