2018లో స్టార్టింగ్ స్టార్టింగే 'భాగమతి' సినిమాతో పెద్ద హిట్ కొట్టేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. 'భాగమతి' విజయంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ పాత్ర అత్యంత కీలకం అని చెప్పక తప్పదు. ఆ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రాణం పెట్టేశాడు తమన్. ఈ సినిమా సంగతిలా ఉంచితే, ఈ నెలలో వరుసగా విడుదలవుతున్న సినిమాల్లో మూడింటికి పైగానే తమన్ మ్యూజిక్‌తో హోరెత్తిపోనున్నాయి.
'ఇంటెలిజెంట్'కి తమన్ అందించిన మ్యూజిక్ ఆల్రెడీ అదరగొట్టేస్తోంది. తమన్ - తేజు కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. 'జవాన్' పాటలతో అదరగొట్టేశారు ఈ ఇద్దరూ. ఇప్పుడు 'ఇంటెలిజెంట్'తో వచ్చేస్తున్నారు. ఇవి కాక తమన్ లిస్టులో ఉన్న మరో రెండు చిత్రాలు 'గాయత్రి', 'తొలిప్రేమ'. సీనియర్ హీరో మోహన్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'గాయత్రి'కీ నేపధ్య సంగీతమే ప్రాణం. తమన్ నేపథ్య సంగీతంలో ఈ సినిమా మ్యూజిక్ ఆకట్టుకోనుంది. అలాగే క్యూట్ లవ్ స్టోరీగా వస్తోన్న వరుణ్ తేజ్ 'తొలిప్రేమ'కి క్యూట్ మెలోడీస్‌తో పాటు, క్లాస్ టచ్ మాస్ బీట్స్‌తోనూ ట్యూన్స్ ఇచ్చాడు తమన్.
ఇవన్నీ ఒకెత్తయితే, మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి' విషయంలోనూ తమన్ పేరే వినిపిస్తుండడం విశేషం. టాలీవుడ్‌లో ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఇప్పుడు తమన్ పేరు టాప్ ప్లేస్‌లో వినిపిస్తోంది. తమన్ కాకపోతే, ఇంకెవరు ? అనే అనుమానం కూడా కలుగుతోంది. ఆ స్థాయిలో తమన్ రేస్‌లోకి దూసుకొచ్చేశాడు. తన మ్యూజిక్ మాయాజాలంతో మెస్మరైజ్ చేసేస్తున్నాడు.