నాలుగు రోజుల్లో ఐదు కోట్ల షేర్ వసూలు చేయడం, అదీ ఓ తమిళ సినిమా కావడం చిన్న విషయమేమీ కాదు. విశాల్ హీరోగా నటించిన 'పందెం కోడి-2' సినిమా పక్కా మాస్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెల్సిందే.
దసరా పండక్కి మాస్ ఆడియన్స్‌ని ఈ మూవీ బాగానే ఆకట్టుకుంది. సినిమా టాక్‌కి భిన్నంగా వసూళ్ళను రాబడుతుండడం విశాల్ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది. తెలుగునాట ఈ వసూళ్ళు చూసి తమిళనాడులో విశాల్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంక్రాంతికి తెలుగులో పెద్ద సినిమాలు బాగానే వున్నాయి. 'అరవింద సమేత' విజయదశమికి కొద్ది రోజులు ముందు, అదీ దసరా సెలవుల్లోనే విడుదలయ్యింది. దసరా సీజన్ అంతటా పండగ చేసుకుంది 'అరవింద సమేత'.
ఇంకో పక్క సరిగ్గా విజయదశమి రోజున విడుదలైన 'హలో గురూ ప్రేమకోసమే' కూడా ఫర్వాలేదన్పించుకునే టాక్ రాబట్టుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమాల మధ్యన 'పందెం కోడి-2' వసూళ్ళను రాబట్టడం పట్ల ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్లాస్ సెంటర్స్‌లో డల్‌గా వున్నా, మాస్ సెంటర్స్‌లో 'పందెం కోడి-2' సినిమాకి మంచి వసూళ్ళు వస్తున్నాయి
. విశాల్ కెరీర్‌లోనే తెలుగునాట 'పందెం కోడి-2' అత్యధిక వసూళ్ళ రికార్డ్‌ని అందుకునే అవకాశం వుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.