హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలతో పాటు, ఎన్నో విలక్షణ పాత్రల్నీ, ఛాలెంజింగ్ రోల్స్‌నీ పోషించిన దీపికా త్వరలో ఓ రియలిస్టిక్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ బయోపిక్‌లో దీపికా నటిస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
మేఘనా గుల్జర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి 'చపక్' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. దీపికా నటించిన 'పద్మావత్' సినిమాకి వివాదాలు వెంటాడినా, ఆమె కెరీర్‌లోనే అది ది బెస్ట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. ఆ సినిమాని చాలా చాలా ఎమోషనల్‌గా ఫీలైందట దీపికా పదుకొనే. అంతకు మించి ఎమోషన్ ఉన్న సినిమా అనీ, ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాననీ, అదీ ఫిజికల్‌గా కాదు, మెంటల్ పెయిన్ అనీ చెప్పింది. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు చాలా స్ట్రగుల్ ఫీలయ్యాననీ దీపికా చెప్పింది.
15 ఏళ్ల వయసులో వున్నప్పుడు లక్ష్మీ అగర్వాల్ యాసిడ్ దాడికి గురైంది. 32 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అయినా కానీ ఆ తర్వాత కూడా తనలోని ఆత్మ స్ధైర్యాన్ని కోల్పోకుండా, తనలాంటి యాసిడ్ బాధితుల తరపున పోరాటం చేసిన గొప్ప మహిళ లక్ష్మీ అగర్వాల్. ఈ పాత్రలోనే దీపికా కనిపించబోతోంది. సినిమాలో దీపికా పాత్ర పేరు మాల్తీ. 'పద్మావత్' తర్వాత అంత మంచి గుర్తింపు తెచ్చే సినిమా 'చపక్' అవుతుందని దీపికా చెప్పుకొచ్చింది.