ఈ రోజుల్లో సోషల్ మీడియా గురించి కొత్తగా ఎవరికీ పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ స్మార్ట్ యుగంలో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకంగా మారింది. ఓ అంచనా ప్రకారం ఇండియన్ నెటిజన్స్ 70 శాతం సమయాన్ని సోషల్ మీడియా కోసం కేటాయిస్తున్నారు. వీటిల్లో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి వున్నాయి. అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రభావవంతంగా మారిన మరో సోషల్ మీడియా సాధనం షేర్ ఛాట్. సోషల్ మీడియాలో టాప్ స్లాట్ దక్కించుకోవడానికి అత్యంత వేగంగా ఈ యాప్ దూసుకుపోతోంది.
'దేశీ' ఫ్రెండ్లీ కంటెంట్ కారణంగా షేర్ ఛాట్ ఇంతటి ప్రాచుర్యం, చాలా తక్కువ కాలంలో దక్కించుకుంటోందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా సెలబ్రెటీ వీడియోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సమంత, ప్రగ్యా జైస్వాల్, తనీష్, సంజనా గార్లాని, అల్లు శిరీష్, అనుపమ పరమేశ్వరన్, శ్రద్ధా దాస్, కేథరీన్ ట్రెసా, ఈషా రెబ్బా, హంసా నందిని, సింగర్ హేమచంద్ర, తనీష్ లాంటి ఎందరో షేర్ చాట్‌లో తమ వీడియోలతో హల్‌చల్ చేస్తున్నారు.
ఇంకోపక్క, షేర్ చాట్, యూనిక్ డౌన్‌లోడ్ మరియు షేరింగ్‌ని వాట్సాప్ ఫీచర్ ద్వారా కలిగి వుంది. ఏ అంశాన్నయినా క్షణాల్లో వైరల్ చేయడానికి ఇది ఉపయోగపడుతోంది. విదేశీ యాప్స్ తరహాలో కాదు, ఇది అచ్చంగా ఇండియన్ యాప్. మేక్ ఇన్ ఇండియా లైన్‌లో ఈ యాప్‌ని రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాత ప్లాట్‌ఫామ్స్ పక్కన సగర్వంగా నిలబడేలా ఈ యాప్‌ని రూపొందించి నెటిజన్లకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నారు.