గ్లామ్‌ షాట్‌: రెడ్‌ హాట్‌గా ఆరబోసేసిన శృతి

మరిన్ని వార్తలు

ఈ మధ్య శృతిహాసన్‌ సందడి ఎక్కడా కన్పించడంలేదు. తెలుగులో అయితే అసలు సినిమాలే చేయడంలేదు. కోలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ అవకాశాలు ఆమెకు కన్పించకపోవడంతో ప్రస్తుతం ఓ టీవీ షోకి హోస్ట్‌గా సెటిలైపోయింది. అయితే, అందాల ప్రదర్శనలో మాత్రం తానెప్పుడూ ముందుంటానని, గ్లామర్‌ ప్రపంచంలో తనకు తిరుగే లేదని నిరూపిస్తూ, ఇదిగో ఇలా ఓ లేటెస్ట్‌ ఈవెంట్‌లో రెడ్‌ హాట్‌గా తన అందాల్ని మీడియా కెమెరాల ముందు ఆరబోసేసింది.

 

'వారెవ్వా శృతి.. యూ ఆర్‌ రియల్‌ రెడ్‌ హాట్‌..' అంటూ ఆమె అభిమానులు సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి చేసేస్తున్నారు ఈ ఫొటోలతో. తెలుగులో మళ్ళీ శృతి సందడి చేయబోతోందనీ, మెగాస్టార్‌ చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఆమె పేరు పరిశీలిస్తున్నారనీ ప్రచారం జరుగుతోన్న సంగతి తెల్సిందే. అందుకేనేమో శృతి ఇంత హాట్‌గా రీ-ఎంట్రీకి ప్లాన్‌ చేసినట్లుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS