మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చాక ఒక్కసారిగా ఆయన తో సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో అందరు ఆసక్తి చూపుతున్నారు.
ఇక విషయానికి వస్తే, మహానటి చిత్రం చూసాక ఆ చిత్రాన్ని తీసిన విధానం, కథని అందరికి అర్ధమయ్యే రీతిలో చెప్పడం ద్వారా మెగా స్టార్ చిరంజీవి దృష్టిలో పడ్డాడు దర్శకుడు నాగ్ అశ్విన్. దీనితో నాగ్ అశ్విన్ తో ఒక చిత్రం చేయడానికి మెగాస్టార్ ఇష్టత చూపించారు.
ఈరోజు మహానటి టీంకి ఆయన ఇంటిలో ఏర్పాటు చేసిన ఒక చిన్న సత్కార సభలో ఆయన అందరితో ఈ విషయానికి సంబందించిన ఒక చిరు ప్రకటన చేశాడు. నిర్మాత అశ్విని దత్ కూడా చిరంజీవి తో ఒక సినిమా చేయాలనీ అనుకుంటుండగా ఇప్పుడు స్వయాన ఆయన అల్లుడే దర్శకుడిగా ఒక సినిమా చేయనుండడం విశేషం.
ఈ కథ టైం మిషన్ లేదా పాతాళ భైరవి వంటి ఒక జానపద చిత్రం అయితే తాను చేస్తాను అని చిరంజీవి చెప్పుకొచ్చారు.