బిగ్ బాస్ లీక్ : దీప్తి నల్లమోతుని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్..?

మరిన్ని వార్తలు

గత మూడున్నర నెలలుగా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్-2  ఈ వారంతో ముగియనుంది. కౌశల్, గీతా మాధురి, తనీష్, సామ్రాట్ మరియు దీప్తి నల్లమోతు టాప్ ఫైవ్ ఫైనలిస్టులుగా ఉన్నారు. వీరిలో ఎవరికైతే ఎక్కువగా ఓట్స్ వస్తాయో వారే విజేత కానున్నారు. అయితే దీప్తి నల్లమోతుని మిడ్ వీక్ ఎలిమినషన్లో (వారం మధ్యలో) భాగంగా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపారని సోషల్ మీడియా వేదికగా టాక్ వినిపిస్తోంది.

అది కూడా ఈ వారం జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియ ఆధారంగానే ఎలిమినేట్ చేస్తున్నారని సమాచారం. దీప్తికి బయట ఫేక్ ఓటింగ్స్ జరుగుతున్నాయని ఆరోపణలు కూడా వచ్చాయి, అది కూడా కొంత కారణం అయి ఉండొచ్చని టాక్. నిజంగా దీప్తి నల్లమోతు ఎలిమినేట్ అయ్యిందో లేదో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

ఆ విధంగా మిగిలిన నలుగురిలో ఇద్దరు గ్రాండ్ ఫైనల్ కి వెళ్తారు. ఆ ఇద్దరిలో నుండి విజేతని ప్రకటిస్తారు బిగ్ బాస్. అయితే ఇంతకముందు కూడా ఏ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో మనకి ముందే తెలిసిపోతూ వచ్చింది. కిరీటి, భాను, తేజస్వి, శ్యామల మరియు బాబు గోగినేని కూడా ఎలిమినేట్ అవుతున్నారని ముందే తెలియడం గమనార్హం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS