తెలుగులో బాలయ్య హీరోగా వచ్చిన 'వీరభద్ర' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. పేరు తనూశ్రీ దత్తా. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ విశాల్ సరసన ఓ సినిమాలో నటించింది. అయితే ఇప్పుడెందుకీ బ్యూటీ తెరపైకి వచ్చిందనుకుంటున్నారా?
అక్కడికే వస్తున్నా.. విషయం ఏంటంటే, తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాననీ తాజాగా సోషల్ మీడియాలో పేర్కొంది. ఓహో అందులో ఏముంది విచిత్రం అనుకుంటున్నారా? ఇంతకీ ఈమెపై లైంగిక వేధింపులకు పాల్పడింది ఎవరో తెలుసా? బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ అట. ఈ పేరును ప్రస్థావిస్తూ ఆమె తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. అక్కడితోనూ ఆగలేదు. నానా పటేకర్‌కి ఈ విషయంలో పలువురు స్టార్ హీరోలు సహకరించారంటూ లిస్టు కూడా విడుదల చేసింది.
ఆ లిస్టులో అక్షయ్ కుమార్‌తో పాటు, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తదితరులు ఉండడం గమనించాల్సిన విషయం. అయితే ఈ ముద్దుగుమ్మ చేసిన ఆరోపణలను పలువురు బాలీవుడ్ నటులు కొట్టి పాడేస్తున్నారు. ఎప్పుడైతే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ తతంగాన్ని తెరపైకి తీసుకొచ్చిందో ఏదో మూల నుండి ఈ రకమైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే, సోషల్ మీడియా ఉంది కదా అని, ఆధారాల్లేని ఆరోపణలతో ఒకరి తర్వాత ఒకరుగా ముద్దుగుమ్మలు ఇలా రెచ్చిపోతున్నారు. అదే సంగతి.!