ఓ పక్క బుల్లితెరపై 'బిగ్‌బాస్' హోస్ట్‌గా ప్రతీ వారాంతంలోనూ బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత సన్నిహితంగా ఉంటోన్న నాని, మరోవైపు వెండితెరపై 'దేవదాస్'గా మెరిసేందుకు సిద్ధమయిపోతున్నాడు. బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షో క్లైమాక్స్‌కి చేరుకుంది. వెండితెరపై 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధమైంది. సో ఈ వారం రెండు రకాలుగా నానికి తీవ్ర ఒత్తిడిని కలిగించే వారమే. ఆ ఒత్తిడి నానిలో కనిపిస్తోంది.
'దేవదాస్' ప్రమోషన్స్‌లో భాగంగా నాని తన ఒత్తిడిని తీర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ, సినిమా విడుదలైతే కానీ ఆ ప్రెషర్ నుండి బయటపడలేడు నాని. ఇకపోతే నానికి 'దేవదాస్' విజయం చాలా కీలకమైనది. వరుస విజయాలతో దూసుకెళ్లిన నాని కెరీర్‌కి 'కృష్ణార్జున యుద్ధం'తో బ్రేకులు పడ్డాయి. మళ్లీ తన బండి పట్టాలపై జోరందుకోవాలంటే 'దేవదాస్' ఖచ్చితంగా హిట్ అయ్యి తీరాల్సిందే.
నాని తొలిసారి చేస్తున్న మల్టీ స్టారర్ చిత్రమిది. నాగార్జున - నాని కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఇదిలా ఉంటే, నాని తదుపరి 'జెర్సీ' అనే క్రికెట్ నేపథ్యమున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బ్యాట్స్‌మేన్‌గా కనిపిస్తాడట నాని.
ఎప్పుడో టెన్త్ క్లాస్‌లో ఆడిన క్రికెట్‌ని ఇప్పుడు మళ్లీ గుర్తు చేసుకుంటున్నాడట. 'జెర్సీ' సినిమా కోసం రోజూ మూడు గంటలు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇలా క్రికెట్ ఆడుతుంటే ప్రస్తుతం అనుభవిస్తున్న ఒత్తిడి నుండి కాస్త రిలీఫ్ దొరుకుతోందంటున్నాడు మన నేచురల్ స్టార్ నాని.