'శైలజారెడ్డి అల్లుడు' సిద్ధమైపోయాడు

By iQlikMovies - July 21, 2018 - 13:07 PM IST

మరిన్ని వార్తలు

నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శివగామి రమ్యకృష్ణ అత్త 'శైలజారెడ్డి' పాత్ర పోషిస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. లేటెస్టుగా ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియపరుస్తూ చిత్రయూనిట్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. 

మారుతి మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే అత్త - అల్లుడు కాన్సెప్ట్‌ స్టోరీస్‌ ఎవర్‌గ్రీన్స్‌. ఈ కాన్సెప్ట్‌తో గతంలో పలు చిత్రాలు రూపొందాయి. అన్ని సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకున్నాయి. అయితే ఈ మధ్య అత్త - అల్లుడు కాన్సెప్ట్‌ని అంతగా టచ్‌ చేయడం లేదు. హీరోకి లోపం పెట్టి, ఆ లోపం నుండి ఫన్‌ క్రియేట్‌ చేసి, వరుసగా రెండు హిట్లు కొట్టేశాడు మారుతి. ఈ సారి ఫార్మేట్‌ ఛేంజ్‌ చేసి, కొంచెం కొత్తగా నవ్విస్తానంటున్నాడు. 

ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇక అత్తగా రమ్యకృష్ణ ఆల్రెడీ చాలా సినిమాల్లో ప్రూవ్‌ చేసుకుంది. ఈ సారి శైలజారెడ్డిగా తన ఎక్స్‌పీరియన్స్‌ని ఎలా యూజ్‌ చేసిందో చూడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఇకపోతే అనూ ఇమ్మాన్యుయేల్‌ విషయానికి వస్తే అమ్మడు పాపం వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతోంది. 

ఈ తరుణంలో 'శైలజారెడ్డి అల్లుడు' అయినా ఈ ముద్దుగుమ్మను గట్టెక్కిస్తుందో లేదో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS