కుమారి చీర కట్టిందోచ్‌!

మరిన్ని వార్తలు

'కుమారి 21ఎఫ్‌' సినిమాతో హెబ్బా పటేల్‌ తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే సక్సెస్‌ అందుకుంది. అలాగే ఈ సినిమాలో అమ్మడు తన నటనలో విశ్వరూపం చూపించింది. అలాగే గ్లామర్‌ కూడా ఫుల్‌ డోస్‌లో పండించేసింది. ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాల్లో కూడా హెబ్బా తన అంద చందాలతో ఆకట్టుకుంది. తాజాగా 'మిస్టర్‌' ఆడియో ఫంక్షన్‌లో ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో దర్శనమిచ్చింది. చేనేత వస్త్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా మారిపోతున్నారు ముద్దుగుమ్మలు. సాంప్రదాయ వస్త్ర ధారణ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అలాగే లైట్‌ క్రీమ్‌ శారీలో సాంప్రదాయంగా రెడీ అయ్యి వచ్చింది హెబ్బా పటేల్‌. గతంలో కూడా అప్పుడప్పుడూ సినిమాల్లో చీర కట్టులో కనిపించినా కానీ, ఈ ఫంక్షన్‌లో మాత్రం హెబ్బా చీరకట్టు ప్రధాన ఆకర్షణగా మారింది. 'మిస్టర్‌'లో మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తోంది ఈ భామ. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్‌ అయిన లావణ్య త్రిపాఠి మోడ్రన్‌ డ్రస్సులో ఫంక్షన్‌కి విచ్చేసింది. ఈ ముద్దుగుమ్మ సినిమాలో ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తుంది. ఈ ఆడియో వేదికకు వీరిద్దరూ రివర్స్‌లో రెడీ అయ్యి వచ్చారు. మొత్తానికి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ ఫంక్షన్‌లో సెంటర్‌ ఆప్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఏప్రిల్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళిన 'మిస్టర్‌' టీమ్‌ సూపర్‌ హిట్‌ కొడతామనే ధీమా వ్యక్తం చేస్తోంది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS