కమల్ హాసన్ ఓ ప్రమాదం నుంచి తృటిలోతప్పించుకొన్నారు. శుక్రవారం అర్థరాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కమల్ నిద్రిస్తున్నారు. వెంటనే సిబ్బంది కమల్ని అప్రమత్తం చేయడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అప్పటికే కమల్ గదినిండా పొగ వ్యాపించిందని, ఆయన ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైందని కమల్ సన్నిహితులు చెబుతున్నారు. ఎవ్వరికీ ఏ నష్టం జరగలేదు, నేను క్షేమంగానే ఉన్నా అంటూ ట్వీట్ చేశారు కమల్. ఆ మధ్య కమల్‌హాసన్ తన నివాసంలోనే మెట్ల పై నుంచి జారి పడడంతో కాలు విరిగింది. దాంతో ఆయన కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సివచ్చింది. ఇప్పుడు అదే ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది.