'దేవదాస్‌'కి మత్తు దిగిందా? అంతే సంగతి

By iQlikMovies - August 07, 2018 - 19:23 PM IST

మరిన్ని వార్తలు

'వీళ్లకి మత్తింకా దిగినట్లు లేదు. దిగిందంటే అల్లరే అల్లరి' అంటూ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేశారు. నాగార్జున 'దేవ్‌'గా, నాని 'దాస్‌'గా నటిస్తున్న చిత్రమిది. 'దేవదాస్‌' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదల చేశారు పైన చెప్పిన క్యాప్షన్‌తో ఈ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. 

నాని, నాగార్జున ఔట్‌ అవుట్‌ బీభత్సమైన ఫన్‌తో ఈ సినిమా రూపొందిందన్న దానికి తాత్కారం ఈ ఫస్ట్‌లుక్‌ అని చెప్పొచ్చు. శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇకపోతే ఫస్ట్‌లుక్‌ విషయానికి వస్తే, నాగార్జున, నాని ఇద్దరూ ఫుల్‌గా తాగేసి ఒకే బెడ్‌పై పడుకున్నారు. నాగార్జున చేతిలో గన్‌ కనిపిస్తోంది. నాగార్జున ఈ సినిమాలో డాన్‌ పాత్రలోనూ, నాని డాక్టర్‌ పాత్రలోనూ కనిపించబోతున్నారన్న సంగతి టైటిల్‌ ఫస్ట్‌లుక్‌తోనే తెలిసిపోయింది. అయితే ఈ డాన్‌కీ, ఆ డాక్టర్‌కీ ఏంటి సంబంధం.? అదీ ఇంత క్లోజ్‌గా.. అనేది తెలియాలంటే సెప్టెంబర్‌ 27 వరకూ ఆగాల్సిందే. అదే రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకాంక్షసింగ్‌, రష్మికా మండన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

ఇకపోతే నాగార్జునది ఈ సినిమాలో ఫుల్‌ మాస్‌ క్యారెక్టర్‌ అట. నాని క్యారెక్టర్‌ హిలేరియస్‌గా ఉండబోతోందట. షూటింగ్‌ సెట్‌లో ఫుల్‌ రచ్చ రచ్చ జరిగిందట. ఇదిలా ఉంటే, తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌కి నాని సోషల్‌ మీడియాలో ఫన్నీ పోస్ట్‌ పెట్టాడు. '96లో నాగార్జున 'నిన్నే పెళ్లాడతా' సినిమా చూడ్డానికి క్యూ లైన్‌లో నిల్చున్నాను. 

2018లో 'దేవదాస్‌' సినిమాకి నాగార్జున, నేను కలిసి ఒకే బెడ్‌ మీద తాగేసి పడుకున్నాం' అని సోషల్‌ మీడియాలో నాని పోస్ట్‌ చేశాడు.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS