దేవ్ దాస్ సినిమా హాలీవుడ్ ఫ్రీమేక్ అట!

By iQlikMovies - August 08, 2018 - 10:18 AM IST

మరిన్ని వార్తలు

కింగ్ నాగార్జున & నానిల మల్టీస్టారర్ దేవ్ దాస్ కి సంబందించిన ఫస్ట్ లుక్ నిన్న విడుదలైంది. అయితే మొదటినుండి ఈ సినిమాకి ప్రేరణ ఒక హిందీ చిత్రం అంటూ పలు వార్తలు వచ్చాయి.

కాకపోతే నిన్న ఫస్ట్ లుక్ విడుదలయ్యాక మాత్రం ఈ చిత్రం హాలీవుడ్ లో వచ్చిన “అనలైజ్ దిస్” అనే చిత్రం తాలుకా ఫ్రీమేక్ అని అంటున్నారు. ఆ చిత్రంలో కూడా ఒక డాన్-డాక్టర్ మధ్య జరిగే కథ కాగా ఈ దేవ్ దాస్ కూడా అదే కథ కాబట్టి కచ్చితంగా ఇది ఆ చిత్రానికి ఫ్రీమేక్ అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది.

ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని నిర్మిస్తుండగా యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

మరి ఇది ఫ్రీమేక్ అవునో? కాదో? అన్నది రిలీజ్ అయ్యాక కాని తెలియదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS