తమిళనాట తన మాట, పాట, చాణక్య రాజనీతితో తమిళ ప్రజల పై తన ముద్రని సుస్పష్టంగా వేసిన మాజీ ముఖ్యమంత్రి, సినీ రచయత, DMK పార్టీ అధ్యక్షులు M. కరుణానిధి (94) ఇక లేరు.
ఈరోజు సాయంత్రం 6.10 నిమిషాలకి తుదిశ్వాస విడిచినట్టుగా చెన్నైలోని కావేరీ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలియచేసింది. గత కొంత కాలంగా వృధాప్యం వల్ల వచ్చే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకి వైధ్యులు నిరంతరం వైద్యం అందిస్తూనే ఉన్నా ఆయనని మృత్యువు నుండి కాపాడలేకపోయారు.
ఆయన క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చేముందు తమిళ సినిమాలకి కథలు, సంబాషణలు అందించారు అలాగే అప్పట్లో పలు నాటికలు, నాటకాలకు ఆయన కలాన్ని అందించడం జరిగింది. ఇక రాజకీయాల్లో ఆయన ఓటమి ఎరుగని నాయకుడు అని చెప్పాలి, అప్రతిహతంగా 13 సార్లు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికై చరిత్ర సృష్టించారు.
33 ఏట తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన నాటి నుండి నేటి వరకు ఆయనకీ ఎన్నికల్లో ఓటమి లేనేలేదు. ఈ కాలంలో ఆయన 5 మార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మృతికి దేశ విదేశాల నుండి పురప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.
ఈ విషాద సమయంలో మా www.iQlikmovies.com తరపున కరుణానిధి గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము.